Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: April 18, 2019, 11:22 AM IST
అసోంలో ఆగ్రహిస్తున్న ప్రజలు
Lok Sabha Election 2019 : లోక్ సభ ఎన్నికల రెండో దశలో మొత్తం 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు ఉదయమే వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ఐతే... అసోంలో ఈవీఎంలు మొరాయించడంతో అక్కడ పోలింగ్ ముందుకు సాగట్లేదు. అసోంలోని నార్త్ కరీంగంజ్‌లో అసలు పోలింగే మొదలవ్వలేదు. అక్కడి ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడంతో... పోలింగ్ని నిషేధించాలని ప్రజలు నిర్ణయించారు. ఉదయం 10.30 వరకూ అక్కడ ఒక్క ఓటు కూడా పడలేదు. ఓ మహిళ మాత్రం కళ్లు తిరిగి కింద పడింది.
బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పల్లెల్లోని పోలింగ్ బూతుల్లోకి వెళ్లిపోతున్నారన్న ఆరోపణలు కలకలం రేపాయి. కార్యకర్తలు పోలింగ్ బూతుల్ని ఆక్రమించి... అక్రమాలకు పాల్పడుతున్నారని ఓటర్లు ఆందోళనలకు దిగుతున్నారు. అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తర దినాజ్ పూర్ జిల్లాలోని హతిగషాలో గ్రామస్థులు... తమ ఓటర్ ఐడీలను తృణమూల్ కార్యకర్తలు లాక్కున్నారని మండిపడుతున్నారు. దాదాపు 200 మంది ఓటర్లను కార్యకర్తలు తరిమికొట్టడంతో... హింస చెలరేగింది. దాంతో ఓటు వేసేది లేదని రెండు పోలింగ్ కేంద్రాల జనం తీర్మానించారు. అక్కడ కేంద్ర పారా మిలిటరీ దళాలు లేకపోవడం అసలు సమస్య అయ్యింది.
ప్రధానమంత్రి చాపర్‌ను చెక్ చేసిన అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చెయ్యడం రాజకీయంగా కలకలం రేపింది. ఈసీ చర్యను కాంగ్రెస్ తప్పుపట్టింది. ఆ అధికారి ఏం తప్పుచేశారని ఈసీ ఆయన్ను సస్పెండ్ చేసిందో చెప్పాలని అధికారికంగా డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి :
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు... ఇద్దరు మావోయిస్టుల హతం
రేపు హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర... వైన్ షాపులు, బార్లూ బంద్...Lok Sabha Election 2019 : ఓటర్ టర్నవుట్ యాప్... పోలింగ్ శాతం ఇట్టే తెలుసుకోవచ్చు...
Lok Sabha Election 2019 : 11 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో రెండో దశ పోలింగ్... ఇవీ ప్రత్యేకతలు
Published by:
Krishna Kumar N
First published:
April 18, 2019, 11:22 AM IST