LOK SABHA ELECTION 2019 KNOW HOW TO CHECK IF YOUR NAME IS ON THE ELECTORAL LIST SS
Lok Sabha Election 2019: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా... లేదా? 3 నిమిషాల్లో తెలుసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
Lok Sabha Election 2019 | పేరు, ఏజ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, జిల్లా వివరాలు ఎంటర్ చేసి మీ ఓటు వివరాలు తెలుసుకోవచ్చు. మరి ఎన్నికల నగారా మోగింది కాబట్టి ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి.
ఎన్నికల నగారా మోగింది. దేశమంతా ఇప్పుడు ఎన్నికల గురించే చర్చ. అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. మొత్తం 7 దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో లోక్‌సభకు, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీకి, లోక్‌సభకు ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. మే 23న ఫలితాలు విడుదలౌతాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌కు సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. మరి ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? లేదా? మూడు నిమిషాల్లో ఇలా తెలుసుకోవచ్చు.
ముందుగా మీ ఓటు చెక్ చేసుకోవడానికి మీరు www.nvsp.in వెబ్సైట్లోకి వెళ్లాలి. ఇది నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్. టాప్ లెఫ్ట్‌లో మీకు ‘Search Your Name in Electoral Roll’ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేయాలి. EPIC నెంబర్ లేదా సెర్చ్ డీటెయిల్స్ ఆధారంగా మీ పేరు చెక్ చేసుకోవచ్చు. మీ ఓటర్ ఐడీ కార్డుపైన EPIC నెంబర్ ఉంటుంది. EPIC ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే చాలు మీ ఓటు ఉందో లేదో తెలిసిపోతుంది. వెబ్ పేజీ చివర్లో మీ వివరాలన్నీ కనిపిస్తాయి. ఒకవేళ మీ పేరు కనిపించకపోతే ఓటర్ జాబితాలో మీ ఓటు లేనట్టే.
ప్రత్యామ్నాయంగా 'Search by Details' ద్వారా కూడా మీ ఓటు చెక్ చేసుకోవచ్చు. పేరు, ఏజ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, జిల్లా వివరాలు ఎంటర్ చేసి మీ ఓటు వివరాలు తెలుసుకోవచ్చు. మరి ఎన్నికల నగారా మోగింది కాబట్టి ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి. ఓటు చెక్ చేసుకునే ప్రక్రియ వివరంగా తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.