కుక్కను అరెస్టు చేసిన పోలీసులు... బీజేపీకి ప్రచారం చేస్తోందని...

Lok Sabha Election 2019 : ఎన్నికల సమయంలో ఏ ఒక్క అంశాన్నీ లైట్ తీసుకోవట్లేదు అధికారులు. అభం శుభం తెలియని ఓ కుక్కను కూడా అరెస్టు చేశారంటే... పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

Krishna Kumar N | news18-telugu
Updated: April 30, 2019, 11:25 AM IST
కుక్కను అరెస్టు చేసిన పోలీసులు... బీజేపీకి ప్రచారం చేస్తోందని...
బీజేపీ జెండాతో కుక్క (Image Credit : Twitter)
  • Share this:
Maharashtra Lok Sabha Election 2019 : అది ఏక్ నాథ్ మౌతీరాం ఇష్టంగా పెంచుకుంటున్న కుక్క. దాని మెడకు... బీజేపీ జెండాను తగిలించాడు. ఆ జెండాను ఎలా వదిలించుకోవాలో దానికి అర్థం కాలేదు. అలాగే మహారాష్ట్రలోని వీధుల్లో పోలింగ్ రోజున ముందుకు వెళ్లసాగింది. చాలా మంది రోడ్డున పోతున్న ఆ కుక్కను చూసి... ఇదేంటి... చివరకు కుక్కలు కూడా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయా అని ఆశ్చర్యపోయారు. ఇంకొందరైతే... అయ్యో... కుక్కకు జెండా కట్టారేంటీ... ఎవడ్రా నాయనా ఈ పని చేసింది... అనుకున్నారు. ఇలా ఎవరికి వాళ్లు తమ తమ ఫీలింగ్స్ తమకు తామే అనుకున్నారు. ఐతే... మిగతా పార్టీల నేతలు ఈ విషయాన్ని మహారాష్ట్ర ఎన్నికల అధికారులకు చేరవేశారు. అంతే అధికారులు అదేదో తీవ్రమైన నేరం అన్నట్లు వేగంగా రంగంలోకి దిగారు. ఆ కుక్క ఎక్కడుందో ఆ నోటీ ఈ నోటా తెలుసుకొని... దాన్ని చేరుకున్నారు. కుక్క మెడపై గాలికి అలా అలా కదులుతున్న జెండాను చూడగానే... ఎన్నికల అధికారులు ఆశ్చర్యపోతూ, ఆగ్రహంతో ఊగిపోయారు.

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత... రెండ్రోజులకు నాలుగో విడత ఎన్నికలు జరిగాయి. ఐతే... ప్రచారం ముగిసిన తర్వాత ఆ కుక్క ఆ జెండాతో కనిపించింది. దాన్ని ఎన్నికల కోడ్‌కి విరుద్ధమని ఆయా పార్టీల నేతలు భగ్గుమన్నారు. వెంటనే ఈసీ అధికారుల నుంచీ పోలీసులకు కాల్ వెళ్లింది. వాళ్లు వచ్చి ఆ కుక్కను అరెస్టు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చేస్తే, అది మనిషైనా, జంతువైనా రూల్స్ ప్రకారమే వెళ్తామని తేల్చి చెప్పారు అధికారులు.


మహారాష్ట్రలోని నందుర్భార్‌లో జరిగిందీ విచిత్ర ఘటన. నిజానికి ఈ కేసులో అరెస్టు చెయ్యాల్సింది కుక్కని కాదు. దానికి బీజేపీ జెండాను తగిలించి, మోదీకి ఓటు వేయండి, దేశాన్ని కాపాడండి అని దాని ఒంటిపై రాసిన దాని ఓనర్ మౌతీరాంని. కానీ ఈసీ అధికారులు మాత్రం కేసు ఏకనాథ్‌పై పెట్టినా... కుక్కను మాత్రమే పట్టుకెళ్లారు. అంతేకాదు... వీలైనంత త్వరగా దాన్ని తీసుకుపోవాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇలా ఓ కుక్క వ్యవహారం మహారాష్ట్రలో కలకలం రేపింది.

 

ఇవి కూడా చదవండి :

అతి తీవ్ర తుఫానుగా ఫణి... షిప్పులు, హెలికాప్టర్లు సిద్ధం చేసిన నౌకాదళం... ఏపీపై కొంతవరకూ ప్రభావం...

వీవీప్యాట్ స్లిప్పులను ఇలా లెక్కించాలి... రూల్స్ ఏంటో చెప్పిన ఈసీ...టీడీపీకి షాక్... వైసీపీ ఖాతాలోకి గోదావరి జిల్లాలు... కొత్త సర్వేలో ఆసక్తికర అంశాలు...

ఉత్తరాంధ్రలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ... ప్రభావం చూపిస్తున్న జనసేన...
First published: April 30, 2019, 11:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading