4th Phase : 9 రాష్ట్రాలు... 72 సీట్లు... నాలుగో దశ పోలింగ్ ప్రత్యేకతలు ఇవీ

ప్రతీకాత్మక చిత్రం

4th Phase Polling : మూడో దశతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా... నాలుగో దశ పోలింగ్‌కి 9 రాష్ట్రాలు సిద్ధమయ్యాయి.

  • Share this:
Lok Sabha Election 2019 : లోక్ సభ ఎన్నికలకు మొత్తం 7 దశలుండగా... ఇప్పటికే మూడు దశలు పూర్తవగా... నేడు నాలుగో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు దశల్లో సరైన ఓటింగ్ జరగలేదని భావిస్తున్న బీజేపీ, కాంగ్రెస్... నాలుగో దశ ఎన్నికలకు ప్రచారాన్ని ఉద్ధృతంగా చేశాయి. అందువల్ల 9 రాష్ట్రాల్లోని 72 నియోజకవర్గాల్లో నేడు జరిగే పోలింగ్‌పై పార్టీలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి. మహారాష్ట్రలో 17 స్థానాలు, రాజస్థాన్‌లో 13, ఉత్తరప్రదేశ్‌‌లో 13, బెంగాల్‌‌లో 8, మధ్యప్రదేశ్‌‌లో 6, ఒడిశాలో 6, బీహార్‌‌లో 5, జార్ఖండ్‌‌లో 3, జమ్మూకాశ్మీర్‌ ఒక స్థానానికి పోలింగ్‌ జరుగుతోంది. వీటితోపాటు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా నాలుగో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్ని వేర్వేరు తేదీల్లో ఒకే దశతో ముగించిన ఈసీ... ఒడిశాకు మాత్రం నాలుగు దశల్లో నిర్వహిస్తోంది. నేడు జరిగే నాలుగో దశతో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాబోతున్నాయి. ఫలితాలు మాత్రం మే 23నే చెబుతారు. ఈ సందర్భంగా కొన్ని కీలక పాయింట్లు చకచకా తెలుసుకుందాం.

నాలుగో దశలో కీలక అంశాలు :
* నాలుగో దశలో లోక్ సభకు పోటీచేస్తున్న అభ్యర్థులు 961 మంది.
* 1,40,000 పోలింగ్ కేంద్రాల్లో 12,79,00,000 మంది ఓటు వెయ్యబోతున్నారు.
* మహారాష్ట్రలోని నార్త్ ముంబై, సౌత్ ముంబై, నార్త్ సెంట్రల్ ముంబై ఎన్నికలు ఈ దశలోనే.
* నాలుగో విడతతో మహారాష్ట్రలో ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.
* రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో మాత్రం ఇదే విడత తొలిదశ.
* రాజస్థాన్‌లోని జలవర్ బరాన్, జోధ్‌పూర్, బాడ్మేర్ కీలక స్థానాలకు 4 దశలో పోలింగ్‌ జరగబోతోంది.

* ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్, కన్నౌజ్ కూడా ఈ దశలోనే ఉన్నాయి.
* బెంగాల్‌లోని అసన్‌సోల్, మధ్యప్రదేశ్‌లోని చింద్వాడ, సిధీ, జబల్‌పూర్ సెగ్మెంట్లు సోమవారం ఎన్నికలకు వెళ్తు్న్నాయి.
* నాలుగో దశలో మహారాష్ట్రలో బీజేపీ నేత పూనమ్ మహాజన్, కాంగ్రెస్ సీనియర్ నేత సునీల్‌దత్ కూతురు ప్రియాదత్, బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్ ఎంపీలుగా పోటీచేస్తున్నారు.
* సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో బరిలో ఉన్నారు.

* రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కొడుకు వైభవ్... జోధ్‌పూర్‌‌లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్‌‌తో వైభవ్ పోటీ పడుతున్నారు.
* బెంగాల్ అసన్‌సోల్ నుంచి బీజేపీ నేత బాబుల్ సుప్రియో, సాక్షి మహారాజ్‌, జితిన్‌ ప్రసాద్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌ వంటి ప్రముఖులు నాలుగో దశలో ఉన్నారు.
* నాలుగో దశలో ముఖ్యమైన నేతలు, కేంద్రమంత్రులు కూడా పోటీ చేస్తున్నారు. బీహార్‌లోని బెగూసరాయి నుంచీ సీపీఐ తరపున కన్హయ్య కుమార్‌, బీజేపీ నుంచి కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్ పోటీ పడుతున్నారు.

* మధ్యప్రదేశ్‌‌లోని చింద్వారా లోక్‌‌సభ స్థానానికి కాంగ్రెస్‌ తరపున మధ్యప్రదేశ్ సీఎం కమల్‌ నాథ్‌ కొడుకు నకుల్‌ బరిలో ఉన్నారు.
* జమ్మూకాశ్మీర్‌‌లోని అనంతనాగ్‌ లోక్‌‌సభ స్థానానికి మూడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా, కుల్గాం ప్రాంతంలో నాలుగో దశలో ఎన్నికలు జరుగనున్నాయి.

 

ఇవి కూడా చదవండి :

కౌంటింగ్ రోజున ఏజెంట్లు ఏం చెయ్యాలంటే... ఈసీ ఏం చెప్పిందంటే...

ఓటు వేయలేకపోతున్న విరాట్ కోహ్లీ... ఎక్కడ తేడా వచ్చిందంటే...

ఏపీలో పెరిగిన పోలింగ్ వైసీపీకి కలిసొస్తుందా... టీడీపీకి మేలు చేస్తుందా...

మే 26న జగన్ ఏపీ సీఎంగా ప్రమాణం చేస్తారా... ఆ రోజే మంచిదంటున్న జ్యోతిష్యులు... ఎందుకంటే...

వైసీపీ, టీడీపీ... ఏపీలో ఎవరు గెలిచినా అప్పుల తిప్పలే... సీఎం సీటు ముళ్ల కిరీటమే... బిల్లుల భారమే
First published: