భారత్‌కు మరో ముప్పు..మొన్న చైనా నుంచి కరోనా...ఇవాళ ఇరాన్ నుంచి...

ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రాంతంలో మరో మిడతల గుంపు తయారు అయ్యిందని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) నివేదిక పేర్కొంది. ఇది రాబోయే నెలల్లో మరోసారి భారతదేశానికి వలస వెళ్లి మళ్ళీ పంటల నాశనానికి దారి తీస్తుందని పేర్కొంది.

news18-telugu
Updated: July 1, 2020, 3:52 PM IST
భారత్‌కు మరో ముప్పు..మొన్న చైనా నుంచి కరోనా...ఇవాళ ఇరాన్ నుంచి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఒక వైపు, మిడుతల నియంత్రణ కేంద్ర ప్రభుత్వం పెద్ద సవాలుగా మారుతుంటే,, మరోవైపు అవి దేశంలోని 101 జిల్లాలకు వ్యాపించాయి. తొమ్మిది రాష్ట్రాల రైతులు మిడతల దాడిలో తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇప్పటికే హెలికాప్టర్ ద్వారా కీటక నాశకాలను పిచికారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రయత్నం ఎంత విజయవంతమవుతుందో తేలాల్సి ఉంది. అయితే ఈ గండం గట్టక్కెక ముందే మరో గండం ఇరాన్‌లో సమాయత్తమవుతోంది. ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రాంతంలో మరో మిడతల గుంపు తయారు అయ్యిందని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) నివేదిక పేర్కొంది. ఇది రాబోయే నెలల్లో మరోసారి భారతదేశానికి వలస వెళ్లి మళ్ళీ పంటల నాశనానికి దారి తీస్తుందని పేర్కొంది. ప్రస్తుతం మిడతలను నియంత్రించేందుకు హెచ్‌ఐఎల్ ఇండియా లిమిటెడ్ 25 మెట్రిక్ టన్నుల మలాథియాన్ (95% యుఎల్‌వి) ఇరాన్‌కు పంపింది.

ఇదిలా ఉంటే 2,33,487 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలన్నీ మిడతల ప్రభావానికి గురయ్యాయని ఇప్పటికే కేంద్రం పేర్కొంది. మధ్యప్రదేశ్‌లోని 40 జిల్లాల్లో అత్యంత ప్రభావితం అయ్యాయి. ఇక రాజస్థాన్‌లో 31 జిల్లాలు, యూపీలోని 13 జిల్లాలు మిడతల కారణంగా ప్రభావితమయ్యాయి. ఇది కాకుండా, హర్యానా, బీహార్, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్‌లలో కూడా మిడతల ప్రభావం భారీగా ఉంది. 300,000 లీటర్ల మలాథియాన్ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యవసాయ యాంత్రీకరణపై ఉప మిషన్ కింద, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి 800 ట్రాక్టర్లు, స్ప్రే పరికరాలను కొనుగోలు చేయడానికి సహాయం మంజూరు చేసింది.

ప్రస్తుతం వాహనాలపై అమర్చిన స్ప్రే పరికరాలతో 60 కంట్రోల్ టీమ్‌ల ద్వారా మిడుత నియంత్రణ వ్యూహం ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో 200 మందికి పైగా కేంద్ర ఉద్యోగులు మిడతల నియంత్రణ విభాగంలో పనిచేస్తున్నారు. మిడతల నియంత్రణ కోసం జైసల్మేర్, బార్మెర్, జోధ్పూర్, బికానెర్, నాగౌర్లలో 12 డ్రోన్లను మోహరించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. మిడతల నియంత్రణ కోసం డ్రోన్‌లను ఉపయోగించిన ప్రపంచంలో తొలి దేశంగా భారత్ నిలిచింది. ఒక డ్రోన్ ఒక గంటలో 16–17 హెక్టార్ల విస్తీర్ణంలో, 4 గంటల్లో 70 హెక్టార్లలో రసాయనాలను పిచికారీ చేస్తుంది. విస్తరించగలదు.
First published: July 1, 2020, 3:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading