మిడతల దండుతో విమానాలకూ ఇబ్బందులే

విమానయాన సిబ్బంది, ఎయిర్ పోర్టు సిబ్బంది, పైలెట్లు, ఇంజినీర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది.

news18-telugu
Updated: May 29, 2020, 8:29 PM IST
మిడతల దండుతో విమానాలకూ ఇబ్బందులే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా కష్టాల్లో ఉన్న భారత్‌ను ఇప్పుడు మిడతల దండు కూడా వణికిస్తోంది. పశ్చిమ, ఉత్తర భారతంలో పంట పొలాలను నాశనం చేసిన ఈ మాయదారి మిడతలు.. దక్షిణం వైపునకు దూసుకొస్తున్నాయి. ఐతే మిడతల దండు వల్ల కేవలం పంటలకే కాదు.. విమానాలకూ ముప్పు పొంచి ఉందని డీజీసీఏ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. విమానయాన సిబ్బంది, ఎయిర్ పోర్టు సిబ్బంది, పైలెట్లు, ఇంజినీర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది.

డీజీసీఏ మార్గదర్శకాలు:

మిడతలు తక్కువ ఎత్తులోనే ఎగురుతాయని.. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టుల్లో విమానాలు టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

ఎయిర్‌పోర్టుల్లో మిడత దండు ఉంటే.. విమానాల్లోని అన్ని ప్రవేశ ద్వారాల్లోకి ఇవి పెద్ద సంఖ్యలో చొచ్చుకెళ్లే ప్రమాదముంది.

దండు మీదుగా విమానం ప్రయాణించినప్పుడు పిటాట్‌, స్టాటిక్‌ నాళాలు (గాలి వేగాన్ని అంచనా వేసే పరికరాలు) పాక్షికంగా లేదా పూర్తిగా మూసుకుపోయే ప్రమాదముంది.

ఇవి మూసుకుపోతే వాటి నుంచి తప్పుడు సంకేతాలు అందుతాయి. ఎయిర్‌ స్పీడ్‌, అల్టీ మీటర్‌ సూచీలు కూడా సరిగా పనిచేయకపోవచ్చు.

దండు ఎదురుగా వస్తున్నప్పుడు విమానం అద్దాలకు వైపర్లను వేయడం వల్ల మరకలు పడే అవకాశం ఉంది.మిడతల గుంపు కనిపిస్తే వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది వచ్చీపోయే విమానాల సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.

విమాన సిబ్బంది కూడా ఈ సమాచారాన్ని పరస్పరం ఇతర సిబ్బందితో పంచుకోవాలి. నిలిపి ఉంచిన విమానాలనూ తనిఖీ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
Published by: Shiva Kumar Addula
First published: May 29, 2020, 8:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading