లోకో పైలట్ (Train Loco Pilot) అంటే ఎంతో బాధ్యత గల ఉద్యోగం. రైలు ప్రయాణికులు సమయానికి, సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలి. వేలాది ప్రయాణికుల ప్రాణాలు అతడి చేతుల్లోనే ఉంటాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకే రైలు నడిపే లోకో పైలట్ అనుక్షణం అలర్ట్‌గా ఉండాలి. కానీ బీహార్‌లో ఓ లోక్ పైలట్ మద్యం తాగి రచ్చ చేశాడు. మందుకొట్టేందుకు.. రైలును మధ్యలో ఆపేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తప్పతాగి పడిపోయాడు. బీహార్ (Bihar)లోని సమస్తిపూర్ జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బీహార్‌లో మద్యపాద నిషేధం అమల్లో ఉంది. కానీ అవేమీ పట్టించుకోకుండా.. రైలు ప్రయాణికులను మధ్యలో వదిలేసి.. మందుకొట్టేందుకు వెళ్లాడు (Drunken Loco Pilot) లోకో పైలట్.
భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహం శకలం.. ఎలాన్ మస్క్ ఆందోళన.. వచ్చే వారం ఏం జరగనుంది?
సమస్తిపూర్ - సహర్సా ప్యాసింజర్ రైలు (05278) రైలు సోమవారం సాయత్రం 04.05 గంటలకు సమస్తిపూర్ నుంచి సహర్సాకు బయలుదేరింది. సాయంత్రం 5.41 గంటలకు హసన్‌పూర్‌కు చేరుకుంది. అదే సమయంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ వెళ్లాల్సి ఉంది. ఆ రైలును ముందుగా పంపించేందుకు.. ఈ ప్యాసింజర్ రైలు వేరొక ట్రాక్‌లోకి తీసుకెళ్లి.. కాసేపు నిలిపివేశారు. అనంతరం సమయంలో లోక్ పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ కర్మవీర్ యాదవ్ అలియాస్ మున్నా రైలు నుంచి కిందకు దిగారు. కొంతదూరం వాకింగ్ చేసి వస్తానని చెప్పి.. మున్నా అక్కడికి వెళ్లిపోయాడు. హసన్‌పూర్ మార్కెట్‌కు వెళ్లగా.. అక్కడ దుర్గ గుడి సమీపంలోని ఓ షాప్‌లో అతడికి మద్యం దొరికింది. ఓ మందు సీసా కొనుక్కొని.. అక్కడే తాగాడు . అనంతరం టీ స్టాల్‌లో చిన్న గొడవ జరిగింది. మద్యం మత్తులో మున్నా వీరంగం సృష్టించాడు.
వాకింగ్ కోసమని వెళ్లిన మున్నా చాలాసేపయినా తిరిగి రాలేదు. ఈ విషయాన్ని లోకో పైలట్ సంతోష్ కుమార్ స్టేషన్ మాస్టర్ మనోజ్ కుమార్‌కు చెప్పాడు. ఫోన్ చేసినా స్పందించలేదు. చివరకు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో అతడి కోసం గాలించారు. చివరకు ఓ టీ స్టాల్ వద్ద గొడవ జరుగడం.. జనం గుమిగూడడంతో అక్కడికి వెళ్లారు. అక్కడ మద్యం మత్తులో తూలుతూ కనిపించాడు మున్నా. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద మద్యం బాటిల్ కూడా లభ్యమయింది. కొంత మద్యం మిగిలిన బాటిల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ రైలులో టికెట్ అవసరం లేదు.. ఉచితంగా ప్రయాణించవచ్చు.. ఎందుకు? ఎక్కడ?
ఐతే అప్పటికే ఆలస్యమవడంతో ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అదే రైలులో ప్రయాణిస్తున్న లోకో పైలట్ రిషిరాజ్ కుమార్‌ను సహర్సాకు వెళ్లాలని స్టేషన్ మాస్టర్ మనోజ్ కుమార్ అభ్యర్థించారు. అనంతరం రైలు సాయంత్రం 6.47 గంటలకు సహర్సాకు బయలుదేరింది. అసిస్టెంట్ లోకో పైలట్‌ను జీఆర్పీ అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం హసన్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై సమస్తిపూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ అలోక్ అగర్వాల్ విచారణకు ఆదేశించారు. బీహార్‌లో మద్యపాదన నిషేధం అమల్లో ఉన్నా.. చాలాచోట్ల అక్రమంగా మద్యం అమ్ముతున్నారు. ఈ వ్యవహారంపై బీహార్ అధికారులు కూడా సీరియస్ అయ్యారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న దుకణాలపై ఉక్కుపాదంమోపుతున్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Indian Railways, IRCTC