Delhi lockdown : రాజధానిలో అన్‌లాక్ ప్రక్రియ...సోమవారం నుండి మెట్రో సర్వీసులు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(ఫైల్ ఫొటో)

Delhi Unlock :మొత్తం 50 రోజుల తర్వాత దేశ రాజధాని లాక్‌డౌన్ నుండి బయటపడుతోంది..గత కొద్ది రోజులుగా కేసులు తగ్గుతుండడంతో సీఎం కేజ్రివాల్ పలు అన్‌లాక్ ప్రక్రియ పై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నుండి సడలింపులు ఇచ్చారు..

  • Share this:
మొత్తం 50 రోజుల తర్వాత దేశ రాజధాని లాక్‌డౌన్ నుండి బయటపడుతోంది..గత కొద్ది రోజులుగా కేసులు తగ్గుతుండడంతో సీఎం కేజ్రివాల్ పలు అన్‌లాక్ ప్రక్రియ పై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నుండి సడలింపులు ఇచ్చారు..దీంతో మెట్రో రైళ్లలో యాబై శాతం ప్రయాణికులను అనుమతించడంతోపాటు పలు మార్కెట్‌లోని షాపులకు సరి,బేసి విధానంలో తెరిచేందుకు అనుమతించారు. అయితే ఈ నిబంధనలు జూన్ 14 వరకు కొనసాగనున్నట్టు తెలిపారు..అనంతరం పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోనున్నట్టు వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే ప్రైవేటు సంస్థలకు యాబై శాతం సిబ్బందితో అనుమతి ఇచ్చారు. కాగా ప్రభుత్వ కార్యాలయాలు వందశాతం సిబ్బందితో కొనసాగుతాయని చెప్పారు. అయితే వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. మరోవైపు లాక్‌డౌన్ కొనసాగుతుందని అయితే సరి, బేసి సంఖ్య విధానంలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటలవరకు కొనసాగనున్నట్టు ప్రకటించారు. అంటే రాత్రీ ఎనిమిది గంటల నుండి ఉదయం పది గంటల వరకు కర్ఫ్యూ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

కాగా కరోన కేసుల ఉదృతి, ఆక్సిజన్ కొరత, వెంటిలెటర్స్ లేకపోవడంతో స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోన్నారు.. ఈనేపథ్యంలోనే గడిచిన ఏప్రిల్‌లో మాసంలో వారంతపు లాక్‌డౌన్‌ను ప్రారంభించిన ప్రభుత్వం కేసుల సంఖ్య ఎక్కువవడంతో ఏప్రిల్ 19న పూర్తి స్థాయి లాక్డౌన్‌ను విధించింది. దీంతో అప్పటి నుండి జూన్ ఏడు వరకు పొడగిస్తూ పలు దఫాలుగా నిర్ణయం తీసుకుంది..ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మొత్తం 50 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ కొనసాగింది..

కేసుల సంఖ్య క్రమంగా తగ్గడం పాజిటివిటి రేటు ఒక్క శాతం లోపుకు రావడంతో లాక్‌డౌన్ నిబంధలను సడలించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం నిర్ణయం తీసుకున్నారు.ఇక ఢిల్లీలో ప్రభుత్వం విడుదల చేసిన గణంకాల ప్రకారం శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 523 పాజిటివ్ కేసులు నమోదు కాగా 50మంది మృత్యువాత పడ్డారు. ఇక పాజిటివిటి రేటు 0.08 శాతానికి పడిపోయింది.
Published by:yveerash yveerash
First published: