అమృతసర్‌లో రైలు ప్రమాద స్థలి ఘటన వద్ద ఉద్రిక్తత

రైలు డ్రైవర్ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్న స్థానికులు, ఆయన్ను అరెస్టు చేయించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

news18-telugu
Updated: October 21, 2018, 9:27 AM IST
అమృతసర్‌లో రైలు ప్రమాద స్థలి ఘటన వద్ద ఉద్రిక్తత
అమృత్‌సర్ దుర్ఘటన జరిగిన స్థలంలో పోలీసులు..
  • Share this:
పంజాబ్‌‌లోని అమృతసర్‌లో రైలు ప్రమాదం ఘటనా స్థలి దగ్గర స్థానికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో ఆదివారం ఉదయం కూడా ఘటనా స్థలి జోడా ఫటక్‌ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. రైలు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శనివారం నుంచి ఇక్కడ ఆందోళనకు దిగారు. శుక్రవారం రాత్రి రావణ దహనం వేడుకను రైలు పట్టాలపై నిల్చొని వీక్షిస్తుండగా రైలు దూసుకెళ్లడంతో 59 మంది మృతి చెందగా మరో 57 మంది తీవ్రంగా గాయపడడం తెలిసిందే. రైలు డ్రైవర్ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అయితే రైల్వే శాఖ ఈ ప్రమాదంలో తమ తప్పిదం లేదని చెబుతోంది. రైలు డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ఉంటే మరింత పెద్ద దుర్ఘటన జరిగేదని వ్యాఖ్యానించారు. ఇది రైల్వే పరమైన ప్రమాదం కాదంటూ బాధితులకు పరిహారం చెల్లించేందుకు ఆ శాఖ ముందుకు రావడం లేదు. ఇది ‘‘రైలు ప్రమాదం’’ కానందున ఘటనపై విచారణ ఉండదని రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్వనీ లొహానీ ఇది వరకే చెప్పారు. ఇదొక ఘటన కిందికే వస్తుందనీ, ప్రమాదం కాదనీ వివరణ ఇచ్చారు.


రైల్వే డ్రైవర్‌ను అరెస్టు చేయాలన డిమాండ్ చేస్తూ ఘటనాస్థలి వద్ద రైల్వే పట్టాలపైనే స్థానికులు ఆందోళన చేస్తున్నారు. పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఘటనా స్థలం వద్ద భారీ సంఖ్యలో పంజాబ్ పోలీసులను మోహరించారు. ఆదివారం సాయంత్రానికి ఘటనా స్థలం జోడా ఫటక్‌ దగ్గర పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

కాగా జలంధర్-అమృతసర్ రైలు ప్రమాద ఘటనలో 59 మంది మృతి చెందగా...వీరిలో 40మందిని గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ఘటనాస్థలి, ఆస్పత్రిని శనివారం సందర్శించిన పంజాబ్ సీఎం కెప్టన్ అమరీందర్ సింగ్...ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.
First published: October 21, 2018, 9:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading