హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Video viral: షారూక్‌ఖాన్‌ పఠాన్ సినిమాకు నిరసన సెగ ..థియేటర్ల దగ్గర పోస్టర్లు చింపి తగలబెట్టిన వీడియో ఇదిగో..

Video viral: షారూక్‌ఖాన్‌ పఠాన్ సినిమాకు నిరసన సెగ ..థియేటర్ల దగ్గర పోస్టర్లు చింపి తగలబెట్టిన వీడియో ఇదిగో..

Pathaan (Photo:Twitter)

Pathaan (Photo:Twitter)

Shah Rukh Khan: షారూక్‌ఖాన్ లేటెస్ట్ మూవీ పఠాన్ రిలీజ్ సందర్భంగా బుధవారం పలుచోట్ల థియేటర్ల ముందు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని కొందరు పఠాన్ వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీలను చింపి తగలబెట్టారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Bihar, India

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్‌ఖాన్ (Shah rukh khan)నటించిన యాక్షన్, థ్రిల్లర్ పఠాన్‌ (Pathaan)రిలీజ్‌ ఈరోజు. సినిమా టీజర్ రిలీజైన నాటి నుంచి బే షరమ్ సాంగ్ వరకు సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా సినిమా రిలీజ్ సందర్భంగా బుధవారం(Wednesday)పలుచోట్ల థియేటర్ల ముందు నిరసనలు తెలియజేస్తూ సినిమా వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీలను చింపి తగలబెట్టారు. వరల్డ్ వైడ్‌గా పఠాన్ ఓపెనింగ్స్‌ సెన్సేషన్ క్రియేట్ చేస్తాయని భావిస్తుంటే ఈ తరహా ఆగ్రహజ్వాలలు సినిమా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశముందని బాలీవుడ్ హీరో షారూక్‌ఖాన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బిహార్‌(Bihar)భాగల్‌పూర్‌(Bhagalpur)లో ఓ థియేటర్ ముందు పఠాన్‌ ఫ్లెక్సీని చింపి పారేసి తగలపెట్టారు హిందు సంఘాల నేతలు.

Sudheer Babu : వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైన సుధీర్ బాబు కొత్త సినిమా..

ఆగ్రహజ్వాలలు..

బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్ దాదాపు ఐదేళ్ల ఏళ్ల తరువాత పఠాన్ పేరుతో సినిమా రిలీజైతే ..థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం ఉంటుందనుకుంటే ఆగ్రహజ్వాలలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమా రివ్యూస్ రాకముందే థియేటర్ల దగ్గర రాత్రి నుంచే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బిహార్‌లోని భాగల్‌పూర్‌లోని పఠాన్ రిలీజ్ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీని హిందూ సంఘాలకు చెందిన కొందరు చింపారు. ఆ ఫ్లెక్సీలను తగలబెట్టారు. సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో పోలీసులు థియేటర్ దగ్గర సెక్యురిటీ ఏర్పాటు చేశారు.

వరల్డ్ వైడ్‌గా నేడే రిలీజ్ ..

ఇక్కడే కాదు వరల్డ్ వైడ్‌గా షారూక్‌ఖాన్ పఠాన్ రిలీజ్ అవుతోంది. సినిమాలో బే షరమ్ పాటతో పాటు పలు సన్నివేశాలపై హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సెన్సార్‌ కత్తెరలో కొన్ని సీన్లు తొలగించినప్పటికి జనంలో ఆగ్రహజ్వాలలు చల్లారడం లేదు. ఈనేపధ్యంలో పఠాన్ ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర ఎలాంటి ఆందోళనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు.

అడ్వాన్స్ బిజినెస్‌ అదుర్స్..

బుధవారం రిలీజవుతున్న పఠాన్ సినిమాలో దీపికాపడుకొనె హీరోయిన్‌గా నటించింది. వీళ్లిద్దరు చేసిన రొమాంటిక్ సాంగ్ బే షరమ్‌పైనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఐదేళ్ల గ్యాప్ తర్వాత షారూక్‌ఖాన్ నటింటిన సినిమా పఠాన్ కావడంతో ఓపెనింగ్ బిజినెస్‌ సూపర్‌గా ఉంది.

shradda case update: ఫ్రెండ్‌ను కలిసిందని ముక్కలుగా నరికేశాడు.! శ్రద్ధా మర్డర్‌ కేసు ఛార్జ్‌షీట్‌లో నివ్వెరపోయే నిజాలు

వసూళ్లు వస్తాయా లేక..

అడ్వాన్స్‌ బుకింగ్‌లోనే రికార్డులు సృష్టిస్తోంది పఠాన్. గతేడాది రిలీజైన బ్రహ్మస్త్ర రికార్డులను అధిగమిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే షారూక్‌ఖాన్ పఠాన్ రిలీజ్‌ సందర్భంగా రాంచరణ్ పేరు ప్రస్తావించడం కొత్తేమి కాదు. రీసెంట్‌గా ట్రిపులార్ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తే నాకు దాన్ని ముట్టుకోవాలని అంటూ రాంచరణ్‌ని కోరడం జరిగింది. ఈపరిణామాలు చూస్తుంటే షారూక్‌ ఖాన్ , రాంచరణ్ కలిసి ఏదైనా మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారా అనే టాక్ కూడా ఇండస్ట్రీలో మొదలైంది. రీసెంట్‌గా చిరంజీవి లీడ్ రోల్ పోషించిన గాడ్‌ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసినట్లుగా..బ్రహ్మస్త్రలో నాగార్జున చేస్తున్నట్లుగా ..ఫ్యూచర్‌లో షారూక్‌ ఖాన్ మూవీలో రాంచరణ్ కనిపిస్తాడా ఏంటనే చర్చ జరుగుతోంది.

First published:

Tags: National News, Pathaan Movie

ఉత్తమ కథలు