Local Trains To Get TV's : రైల్వే ప్రయాణికులకు సెంట్రల్ రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రయాణం బోర్ కొట్టకుండా ఉండేందుకు లోకల్ ట్రైన్స్ లో టీవీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఎటువంటి ఇంటర్ నెట్ కనెక్షన్ లేకుండా ప్రయాణికులు జర్నీ సాగుతున్నంతసేపు వార్తలు, మ్యూజిక్, సినిమాలు చూసి ఆనందించవచ్చు. ముంబైలో అత్యధికులు లోకల్ రైళ్లపైనే ఆధారపడుతుంటారు. లక్షల మంది నిత్యం వీటి ద్వారానే ప్రయాణం సాగిస్తుంటారు. అందుకే ముంబై నగరంలో లోకల్ రైళ్లకు విపరీతమైన డిమాండ్ వుంటుంది. రైల్వే కూడా అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తుంటుంది. అయితే ప్రయాణికులు తమ ప్రయాణంలో ఎలాంటి బోర్ ఫీల్ కాకుండా వుండేందుకు, ప్రయాణికులను ఆకర్షించేందుకు..ముంబై లోకల్ రైళ్లలో ఇప్పటి నుంచి టీవీలను అమర్చుతున్నారు. ఈ టీవీల్లో సినిమాలు, రక రకాల టీవీ షోలను ప్రసారం చేస్తామని రైల్వే పేర్కొంది.
ఈ మేరకు ముంబై లోకల్ రైళ్లలో సెంట్రల్ రైల్వేస్ కొత్త "కంటెంట్ ఆన్ డిమాండ్-ఇన్ఫోటైన్మెంట్ సర్వీస్"ను ప్రారంభించింది. షుగర్ బాక్స్ నెట్వర్క్ సహకారంతో ముంబై లోకల్ రైళ్లలో టీవీలను ఏర్పాటు చేశారు. 10 సబర్బన్ రైళ్లలో ఈ సర్వీసును ప్రారంభించారు. ఉచితంగా టీవీలను చూడాలంటే ప్రయాణికులు ముందుగా తమ మొబైల్స్ లో షుగర్ బాక్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. మొబైల్ యాప్‌ను యాక్సెస్ చేయడానికి, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. కొద్ది నెలల్లో ఈ సేవ అన్ని రైళ్లలో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఇక,లోకల్ ట్రైన్ ప్రయాణికులు ఇంటర్నెట్ డేటాను ఖర్చు చేయకుండా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. దీనికోసం ప్రతి కోచ్‌లో ఒక పరికరాన్ని ఇన్స్టాల్ చేస్తారు
ALSO READ Mamata సంచలనం: అన్ని పదవుల నుంచి అల్లుడు Abhishek Banerjee ఔట్ -Prashant Kishor ఎఫెక్టేనా?
ముంబై రైల్వే జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ లాహోటీ మాట్లాడుతూ…లోకల్ ట్రైన్స్ పై చాలా మంది ఆధారపడుతుంటారు. కోవిడ్ కు ముందు ముంబైలో లోకల్ రైళ్లలో రోజుకు 45 లక్షల మంది ప్రయాణించేవారు. ఈ ప్రయాణ సమయంలో ప్రయాణికులు తమ తమ సెల్ ఫోన్లు,ఇతరత్రా పరికరాలను తెచ్చుకుంటూ ఉల్లాసంగా గడుపుతారు. దీనికి మేము మా వంతుగా సాంకేతికతను జోడించాలని నిర్ణయించాం. దీని ద్వారా ప్రయాణికులకు మరింత ఉల్లాసాన్ని అందిస్తామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: LED TV, Mumbai Passengers, Trains