Exclusive: రుణమాఫీతో సమస్యలు తీరవు..రైతు ఆదాయం రెట్టింపే మా లక్ష్యం: రాజ్‌నాథ్

పాకిస్తాన్‌తో తాము సంత్సంబంధాలనే కోరుకుంటున్నామని..ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపితేనే పాక్‌తో చర్చలు జరుపుతామని స్పష్టంచేశారు. బాలాకోట్‌లో జరిగిన వైమానికదాడులపై రాజకీయాలు చేయడం తగదన్నారు హోంమంత్రి.

news18-telugu
Updated: March 16, 2019, 7:43 PM IST
Exclusive: రుణమాఫీతో సమస్యలు తీరవు..రైతు ఆదాయం రెట్టింపే మా లక్ష్యం: రాజ్‌నాథ్
రాజ్‌నాథ్ సింగ్
news18-telugu
Updated: March 16, 2019, 7:43 PM IST
2019 లోక్‌సభ ఎన్నికల్లో నిరుద్యోగం, జాతీయ భద్రత, రైతుల సమస్యలు, ఉగ్రవాదం, అయోధ్య రామమందిరం అంశాలే కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఈ అంశాల చుట్టే దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి. దీనికి తోడు ప్రియాంక గాంధీ రాజకీయ ప్రవేశం, యూపీలో ఎస్పీ-బీఎస్సీ అంశాలు కీలంగా మారాయి. గత ఎన్నికల్లో మోదీ మేనియాతో 282 స్థానాలు గెలిచిన బీజేపీ ఈసారి టఫ్ ఫైట్‌ను ఎదుర్కొంటోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి ప్రాభవం కోల్పోయింది. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు సిద్దమవుతోంది బీజేపీ.

లోక్‌సభ ఎన్నికల వేళ CNN-NEWS18కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్. Network18 Group ఎడిటర్ ఇన్ చీఫ్‌ రాహుల్ జోషితో బీజేపీ స్టార్ క్యాంపెయిన్ రాజ్‌నాథ్ పలు కీలక విషయాలను పంచుకున్నారు. దేశ ప్రజలంతా మళ్లీ మోదీనే ప్రధానిగా కోరుకుంటున్నారని వెల్లడించారు రాజ్‌నాథ్. పాకిస్తాన్‌తో తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నామని..ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపితేనే పాక్‌తో చర్చలు జరుపుతామని స్పష్టంచేశారు. బాలాకోట్‌లో జరిగిన వైమానికదాడులపై రాజకీయాలు చేయడం తగదన్నారు హోంమంత్రి.

బాలాకోట్‌లో వైమానిక దాడులను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదు. ఇది జాతి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. పాకిస్తాన్‌తో చర్చలు జరిపేందుకు మేం సిద్ధం. పొరుగుదేశంతో సత్సంబంధాలనే మేం కోరుకుంటున్నాం. కానీ ఉగ్రదాడులు, చర్చలు చేతిలో చేయి కలపలేవు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ చిత్తశుద్దితో చర్యలు తీసుకుంటేనే చర్చలు సాధ్యపడతాయి. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద స్థావరాలను పాకిస్తాన్ ధ్వంసం చేయాలి.
రాజ్‌నాథ్ సింగ్


రాజ్‌నాథ్ సింగ్ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు:మేమూ ఎన్నోసార్లు రైతులకు రుణమాఫీ చేశాం. కేవలం రుణమాఫీతో  సమస్యలు తీరవు. రైతుల ఆదాయం రెట్టింపు కావాల్సిన అవసరముంది.

ప్రియాంక గాంధీతో మాకు ఎలాంటి సమస్య లేదు. ప్రతి ఏటా ఎంతో మంది రాజకీయాల్లోకి వస్తుంటారు. పోతుంటారు.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో లక్నో నుంచే నేను పోటీచేస్తున్నా. వారణాసి నుంచి మోదీ పోటీచేస్తారు.
Loading...
మసూద్ అజర్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసే అంశంలో చైనా సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నా.

పాకిస్తాన్‌పై మూడు సర్జికల్ చేశామని నేనెప్పుడూ చెప్పలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుసార్లు సరిహద్దు దాటి ఉగ్రవాదులపై దాడులు చేశామని మాత్రమే చెప్పా.

బాలాకోట్ వైమానిక దాడులు నిజంగా జరిగాయా? జరిగితే ఎంత మంది చనిపోయారు? అనే ప్రశ్నలను విపక్షాలు లేవనెత్తడం బాధాకరం. ఎంత మంది చనిపోయారనే విషయం తెలియదు. కానీ ఖచ్చితగా దాడులు జరిగాయి.

వైమానిక దాడులతో పాకిస్తాన్ నిర్ఘాంతపోయిందంటే అర్ధముంది. కానీ మనదేశంలోని పార్టీలు ఎందుకు షాకయ్యాయో అర్ధం కావడం లేదు.

వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ ఆడాలా? వద్దా? అనే దానిపై సంబంధిత అధికారులు, బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. దేశ ఆత్మగౌరవం దెబ్బతినకుండా సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం.

ఉగ్రదాడులకు సంబంధించి నిఘా వర్గాలు ముందే పసిగడతాయి. పలానా ప్రాంతంలో దాడులు జరిగే అవకాశముందని హెచ్చరిస్తాయి. ఐతే ఆ నిర్ధిష్టమైన ప్రాంతం గురించి కొన్నిసార్లు స్పష్టమైన సమాచారం లభించదు. పుల్వామా దాడిపై ఎన్ఐఏ దర్యాప్తు జరుగుతోంది.

కాశ్మీర్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ ఉండాలని కోరుకుంటున్నాం. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలపై ఈసీ నిర్ణయం తీసుకుంటుంది. కాశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలను నిర్వహించాం.

90 శాతం మంది కాశ్మీరీలు శాంతిని, రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి కాశ్మీరీలకు కూడా నచ్చడం లేదు.  కానీ కొన్ని శక్తులు చిచ్చుపెడుతున్నాయి.

నరేంద్ర మోదీపై దేశప్రజలకు పూర్తి విశ్వాసముంది. ఆయన నిజాయితీపరుడు. అవినీతి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు.

ఎన్డీయే హయాంలో దేశ ఆర్ధికాభివృద్ధి పరుగులు పెడుతోంది. ప్రపంచంలో బలమైన ఆర్థికవ్యవస్థగా భారత్ ఎదుగుతోంది. రైతులు, యువత, మహిళలు, జవాన్లు ఇలా అన్ని వర్గాల సంక్షేమంగా లక్ష్యంగా పనిచేస్తున్నాం.

ముద్ర పథకం కింద 4-5 కోట్ల మంది ప్రజలు తొలిసారిగా రుణాలు పొందారు. సొంత వ్యాపారాలు ప్రారంభించి ఉపాధి పొందుతున్నారు.

బీజేపీకి కూటమి తప్పనిసరి కాదు. వాగ్ధానం, నిబద్ధత మేరకే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నాం. వాజ్‌పేయి 24 పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఆరేళ్ల పాటు నడిపించారు.

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్ల అధికారంలో ఉన్నాం. ప్రజలు కొన్ని సార్లు మార్పు కోరుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో అదే జరిగింది.

రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి. రఫేల్ పత్రాలు చోరీకి గురికాలేదు. కానీ ఫొటో కాఫీలు బయటకువెళ్లాయి. కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

రామమందిరం అంశం కోర్టు పరిధిలో ఉంది. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇటీవలే సూచించింది. అయోధ్యంలో రామమందిర నిర్మాణం జరిగితే ప్రజలంతా సంతోషపడతారు. ముస్లింలు కూడా ఆహ్వానిస్తారు.

పార్లమెంట్‌లో విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. వారికి కోపం తెప్పించే పనులు మేం ఏమీ చేయలేదు. విపక్షాలను మేం ఎప్పుడూ గౌరవిస్తాం. ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాం.
First published: March 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...