Loan recovery notices to covid orphan: కరోనా మహమ్మారి(Covid Pandamic)ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలను వీధుల్లో పడేసింది. భారత్ లోనూ కోవిడ్ అపార ప్రాణ నష్టాల్ని మిగిల్చింది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని చాలామంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన విషయం తెలిసిందే.
Loan recovery notices to covid orphan: కరోనా మహమ్మారి(Covid Pandamic)ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలను వీధుల్లో పడేసింది. భారత్ లోనూ కోవిడ్ అపార ప్రాణ నష్టాల్ని మిగిల్చింది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని చాలామంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా తల్లిదండ్రులు, ఇతర సంరక్షుకులను కోల్పోయి అనాథలైన పిల్లలను ఆదుకోడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రిసహాయ నిధి (PM Cares) ద్వారా ఆర్ధిక సహాయం అందజేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్య కాలంలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు, సంరక్షుకులు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్స్ కింద సహాయం అందజేస్తారు. ఇందులో భాగంగా స్కాలర్ షిప్‌లు, వైద్య బీమా కార్డులు, పీఎం కేర్స్ పాస్ పుస్తకాలను ఇస్తారు. బాధిత పిల్లల పేరిట రూ.10 లక్షల నగదు బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. వీరికి 18 –23ఏళ్ల మధ్యలో ఆ డిపాజిట్ పై వచ్చిన వడ్డీని ఆర్ధిక సాయంగా ఇవ్వనున్నారు. 23 ఏళ్లు నిండిన తరువాత ఆ రూ. 10 లక్షలను బాధితులకు అందజేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆర్ధిక సహాయా పంపిణీ కార్యక్రమాన్ని కొద్ది రోజుల క్రితం ప్రారంభించారు.
ఇదిలా ఉండగా, కరోనా మహమ్మారితో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన ఓ బాలిక(covid orphan)ను అప్పులు వేధిస్తున్నాయి. చనిపోయిన తన తండ్రి తీసుకున్న లోన్(Loan) చెల్లించాలంటూ ఎల్ఐసీ ఆమెకు నిత్యం నోటీసులు జారీ చేస్తోంది. మధ్యప్రదేశ్(Madhyapradesh)లో ఈ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన జితేంద్ర పాఠక్(LIC ఏజెంట్), ఆయన భార్య గతేడాది కరోనాతో మరణించారు. దీంతో వారి సంతానం వనిషా(17), వివాన్(11) అనాథలయ్యారు.పిల్లలు మైనర్లు కావడంతో జితేంద్రకి చెల్లించాల్సిన కమీషన్ తోపాటు ఆయన పాలసీలను ఎల్ఐసీ బ్లాక్ చేసింది. సొంతింటి కోసం జితేంద్ర గతంలో ఎల్ఐసీ నుంచి లోన్ తీసుకున్నారు. అయితే జితేంద్ర మరణించినప్పటి నుంచి రూ.29లక్షల రుణం తిరిగి చెల్లించాలంటూ LIC.. వనిషాకు పలుమార్లు నోటీసులు జారీ చేసింది. లోన్ కట్టకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ బాలిక తనకు కొంత సమయం ఇవ్వాలంటూ ఎల్ఐసీని వేడుకుంది.
"కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన నేను మైనర్ని, ఆదాయం లేదు.. నాకు 18 ఏళ్లు రాగానే మా నాన్న చేసిన అప్పు తీరుస్తా.. అప్పటిదాకా గడువివ్వండి" అంటూ గృహరుణం వసూలు కోసం తమకు నోటీసులు పంపిన ఎల్ఐసీ సంస్థకు వనిషా పాఠక్ లేఖ రాసింది. జితేంద్ర పేరు మీద ఉన్న కమిషన్లు, సేవింగ్స్ అన్నీ... వనిశాకు 18ఏళ్లు వచ్చిన తర్వాత ఆమె చేతికి రానున్నాయి. కాబట్టి అప్పటిదాకా తనకు సమయం ఇవ్వాలని, తండ్రి పేరు మీద ఉన్న ఆస్తులు వచ్చాక లోన్ చెల్లిస్తానని వనిషా ఎల్ఐసీకి లేఖ రాసినా అటు వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.వనిషా విజ్ఞప్తికి ఎల్ఐసీ స్పందించలేదు. కానీ, మీడియా ద్వారా విషయం తెలుసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman)..ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకుని, తనకు అప్ డేట్ చేయాలని ఆర్థిక సేవల విభాగం, ఎల్ఐసీ ఇండియాకు సూచించారు. నిర్మలా సీతారామన్ జోక్యంతో వనిషాకు తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లు తెలుస్తోంది. వనిషాకు 18ఏళ్లు వచ్చే వరకు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దని నిర్ణయించినట్లు ఎల్ఐసీ వర్గాల సమాచారం.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.