Video : వామ్మో... అక్కడ తేనెతుట్టు... తెగ నవ్వుతున్న నెటిజన్లు

ప్రస్తుతం ఆ వీడియో... సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజూ దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 24, 2019, 6:53 AM IST
Video : వామ్మో... అక్కడ తేనెతుట్టు... తెగ నవ్వుతున్న నెటిజన్లు
తేనెటీగలు (Image : Twitter - Kiren Rijiju)
Krishna Kumar N | news18-telugu
Updated: August 24, 2019, 6:53 AM IST
నాగాలాండ్‌కి చెందిన ఆ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. 40 సెకండ్ల ఆ వీడియో క్లిప్‌లో డెనిమ్ జీన్స్ వేసుకున్న కుర్రాడి వెనకవైపు తేనెటీగలు గూడు కట్టుకున్నాయి. దానికి ఏమాత్రం భయపడని అక్కడి కుర్రాళ్లు... ఆ తేనెతుట్టెను చూసి తెగ నవ్వుకుంటున్నారు. వాట్సాప్‌లో బాగా షేరవుతున్న ఈ వీడియోని మొదట షేర్ చేశారు నాగాలాండ్ ఎమ్మెల్యే మహోన్లుమో కికోన్. "అసాధారణ ప్రదేశంలో తేనె తుట్టె" అనే కామెంట్ పెట్టారాయన. ఇలాంటివి నాగాలాండ్‌లో మాత్రమే జరుగుతాయని జోక్ చేశారు. ఫెక్ జిల్లాలోని... సుతౌజూ గ్రామానికి చెందిన 25 ఏళ్ల అవాలేకి ఈ పరిస్థితి ఎదురైంది. అతని ప్యాంట్స్‌కి వెనకవైపు తేనెతుట్టె ఏర్పడటంతో... అతని గర్ల్ ఫ్రెండ్... కోహిమాకి చెందిన వెలసాలూ నీనూ ఈ వీడియో తీసింది.




ఇదెలా జరిగింది ? : తేనెటీగలకు ఓ లక్షణం ఉంటుంది. రాణీ తేనెటీగ ఆదేశాల్ని మిగతావి పాటిస్తాయి. ఈ వీడియోలో... అవాలే... గ్యారేజీకి వెళ్లినప్పుడు... రాణీ తేనెటీగ ముందుగా... అతని ప్యాంట్స్‌పై వాలింది. అంతే... మిగతా తేనెటీగలు కూడా... వరుసగా వచ్చి అక్కడే వాలాయి. వాటిని వదిలించుకోవడానికి దాదాపు అరగంట పట్టింది. ఇందుకోసం అతను... రాణీ తేనెటీగ రెక్కలు విరిచి... దాన్ని ఓ కంటైనర్ (ఖాళీ డబ్బా లాంటిది)లో పడేశాడు. వెంటనే మిగతా తేనెటీగలూ అందులోకి వెళ్లిపోయాయి. దీనిపై నెటిజన్లు తెగ నవ్వుతున్నారు. మీకు తెలుసా... నాగాలాండ్‌లో రకరకాల తేనెటీగలున్నాయి. అందుకే ఆ రాష్ట్రం... డిసెంబర్ 5ని "నాగాలాండ్ తేనెటీగల దినోత్సవం"గా జరుపుతోంది.
Loading...





First published: August 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...