హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

LK Advani Reaction: బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పుపై అద్వానీ ఏమన్నారంటే...

LK Advani Reaction: బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పుపై అద్వానీ ఏమన్నారంటే...

నరేంద్ర మోదీ, ఎల్కే అద్వానీ

నరేంద్ర మోదీ, ఎల్కే అద్వానీ

LK Advani on Babri Masjid Demolition Verdict: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అందరికంటే ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్నది అద్వానీయే. ఇవాళ్టి తీర్పు ఆయన్ని రాజకీయంగా తిరిగి పైకి తెస్తుందా?

LK Advani on Babri Masjid Demolition Verdict: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు... బీజేపీ మోస్ట్ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ తెలిపారు. ఈ కేసులో బతికివున్న 32 మంది నిందితుల్లో... అద్వానీ కూడా ఉన్నారు. తాజా తీర్పు... మహత్మపూర్వకమైన తీర్పు అన్న అద్వానీ... దీన్ని అందరం స్వాగతించాలి అన్నారు. ఇది సంతోషకర అంశం అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అందరికంటే ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్నది అద్వానీయే. ఈ కేసులో ఆరోపణల వల్ల అద్వానీ... రాజకీయ జీవితంపై ప్రతికూల ప్రభావాలు పడ్డాయి. ఆయన లౌకిక వాదిగా వ్యవహరించట్లేదన్న విమర్శలు వచ్చాయి. వాజ్‌పేయి తరవాత... వారసుడిగా... 2014లో అద్వానీని ముందు పెట్టి... ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సాహసించలేకపోయింది. అంతలా అద్వానీ రాజకీయ జీవితాన్ని ఈ కేసు ఆరోపణలు కుంగదీశాయి.

కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు అద్వానీ దూరంగా ఉన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయమే తెరపై క్రియాశీలంగా మారారు. ఇప్పుడు అద్వానీ వయసు చాలా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో... ఆయనకు పూర్తి అనుకూలమైన తీర్పు వచ్చింది. దీని ద్వారా... నిర్దోషిగా మారిన అయన తనపై ఉన్న మచ్చలను తొలగించుకున్నా... తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనతో లేరని తెలుస్తోంది.

న్యాయం గెలిచింది:

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు ఆలస్యంగా వచ్చినా న్యాయమే గెలిచిందన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. అద్వానీ యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నప్పుడు... రాజ్ నాథ్ కూడా దూకుడుగా వ్యవహరించేవారు.

సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు వివరాలు:

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్ కే యాదవ్... 2000 పేజీల ఆర్డర్ కాపీ తీర్పును వెలువరించారు. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులే అని తీర్పు వెలువరించారు. కూల్చివేత పథకం ప్రకారం జరగలేదని తేల్చారు. కూల్చివేత పథకం ప్రకారం జరిగింది అనేందుకు ఆధారాలు లేవని జడ్జి తెలిపారు. కూల్చివేతకు ఎవరూ రెచ్చగొట్టే ప్రసంగాలు చెయ్యలేదనీ, కుట్రపూరితంగా వ్యవహరించలేదని తెలిపారు. బాబ్రీ మసీదును కూల్చివేసింది కరసేవకులు కాదనీ... సంఘ విద్రోహ శక్తులు ఆ పని చేశారని తెలిపారు. ఈ కూల్చివేత కేసును కొట్టివేశారు. దీంతో నిందితులందరికీ ఉపశమనం లభించినట్లైంది. ఈ కేసులో 48 మంది నిందితుల్లో 16 మంది చనిపోగా... ఆరోపణలు ఎదుర్కొన్న, బతికివున్న 32 మంది బతికివున్నారు. వారంతా ఇప్పుడు నిర్దోషులుగా మారారు.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు పూర్వాపరాలు:

అయోధ్యలో రామాలయం ఉన్న ప్రదేశంలో... దాన్ని కూల్చి... బాబ్రీమసీదును నిర్మించారనే అంశంతో... ఆ మసీదును కూల్చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. 1992లో దేశవ్యాప్తంగా కరసేవకులు అయోధ్యకు తరలివచ్చారు. ఒక్కసారిగా బాబ్రీ మసీదును చేరారు. డిసెంబర్ 6న మసీదు ధ్వంసమైంది. దేశం మొత్తం ఆశ్చర్యంగా చూసింది. ఆ సమయంలో... పెద్ద ఎత్తున దేశమంతా మత ఘర్షణలు జరిగాయి. వాటిలో 1800 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

First published:

Tags: Babri masjid, LK Advani

ఉత్తమ కథలు