అద్వానీకి అస్వస్థత...పంద్రాగస్టు వేడుకలకు దూరం

ఎల్‌కే అద్వానీ

ప్రస్తుతం అద్వానీ వయసు 91 ఏళ్లు. బీజేపీ సహ వ్యవస్థాపకుడైన అద్వానీ పార్టీ నిర్మాణంలో కీలక భూమిక పోషించారు.

  • Share this:
    బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. గత 5 రోజులుగా ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు అద్వానీ కార్యాలయం వెల్లడించింది. అద్వానీ అనారోగ్యంతో ఉన్నందున ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన దూరంగా ఉంటారని తెలిపారు. అద్వానీ ఇంటి వద్ద జెండా వందనం కార్యక్రమం నిర్వహించడం లేదని చెప్పారు. ప్రస్తుతం అద్వానీ వయసు 91 ఏళ్లు. బీజేపీ సహ వ్యవస్థాపకుడైన అద్వానీ.. పార్టీ నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. వయసు పైబడిన కారణంగా లోక్‌సభ ఎన్నికలకు ఆయన దూరంగా ఉన్నారు.

    Published by:Shiva Kumar Addula
    First published: