Supreme Court Proceedings Live Streaming : భారత సుప్రీంకోర్టు‘Supreme Court) చరిత్రలో కీలక పరిణమాం చోటుచేసకుంది. 71 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో ఇవాళ తొలిసారిగా కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం(Proceedings live streaming) అయ్యాయి. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనున్న ఆగస్టు 26న సుప్రీంకోర్టు లైవ్ ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యాయి. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ(CJI NV Ramana).. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు.
సుప్రీంకోర్టు ప్రోసీడింగ్స్ ను ఎన్ఐసీ వెబ్ కాస్ట్ పోర్టల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణకు ఇవాళే చివరి రోజు. ఇవాళ ఆయన రిటైర్ కానున్నారు. 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా యూయూ లలిత్ ఇటీవలనే నియమితులయ్యారు. లలిత్ రేపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణం చేయనున్నారు.
2018 సెప్టెంబర్ 26న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కోర్టులో జరిగే రాజ్యాంగపరమైన ప్రాముఖ్యత కలిగిన కేసులను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే
Serial Conman: ఈడోరకం... పోలీసులకు దొరికిపోవడానికి జనాలను మోసం చేస్తాడు
13 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ ఎన్వీ రమణ.... సీజేఐగా 2021 ఏప్రిల్ లో బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ కోకా సుబ్బారావు తర్వాత సుదీర్ఘకాలం సీజేఐగా చేసిన తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించిన ఎన్వీ రమణ..సీజేఐగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కృషి చేస్తున్నారు. సుప్రీం కోర్టులోనే కాకుండా అన్ని కోర్టుల నుంచి ఈ ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగాలని ఎన్వీ రమణ ఆకాంక్షించారు. న్యాయస్థానాల కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారంపై ఏకాభిప్రాయం రావాల్సి ఉందని గతంలో ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఎట్టకేలకు ఇవాళ ఆయన సీజేఐగా పదవీ విరమణ చేసే రోజు నుంచే ఈ ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభం కావడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: NV Ramana, Supreme Court