మద్యం వ్యాపారులకు కరోనా కాసుల పంట.. ఒక్కో బాటిల్‌పై మూడింతలు

లాక్‌డౌన్ సమయంలో మద్యం దుకాణాలు బంద్ కావడంతో మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని మద్యం దుకాణదారులు డబ్బులు దండుకుంటున్నారు.

news18-telugu
Updated: April 15, 2020, 5:46 PM IST
మద్యం వ్యాపారులకు కరోనా కాసుల పంట.. ఒక్కో బాటిల్‌పై మూడింతలు
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓవైపు కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంటే.. మరోవైపు మద్యం వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. సాధారణ రోజులతో పోల్చితే.. లాక్‌డౌన్ సమయంలో ఒక్కో బాటిల్‌పై మూడింతలు ధర ఎక్కువకు అమ్ముతున్నారు. లాక్‌డౌన్ సమయంలో మద్యం దుకాణాలు బంద్ కావడంతో మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని మద్యం దుకాణదారులు డబ్బులు దండుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ ధరలకు అదుపులేకుండా పోయింది. సాధారణ రోజుల్లో రూ.వెయ్యికి విక్రయించే ఫుల్ బాటిల్‌ రూ.నాలుగైదు వేలకు విక్రయిస్తున్నారు.

జోరుగా కల్తీ మద్యం..

లాక్‌డౌన్‌ను అదనుగా భావించి అక్రమార్కులు అందిన కాడికి దోచుకుంటున్నారు. అసలు మద్యంలో నీళ్లు కలిపడం.. ఎక్కువ ధర మద్యం సీసాలో తక్కువ ధర మద్యం పోయడం వంటి పద్ధతుల ద్వారా మద్యాన్ని కల్తీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొంతమంది మాత్రం వారి కనుసన్నల్లోనే ఈ దందా సాగుతున్నట్టు ఆరోపిస్తున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా వెనకదారి నుంచి..
ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాలకు ముందు నుంచి సీల్ వేసింది. సాధారణంగా మద్యం దుకాణాలకు ముందు షట్టర్లతో పాటు వెనుక వైపు పర్మిట్ రూమ్‌ల్లోకి సప్లై చేసేందుకు మరో దారి ఉంటుంది. ఎక్సైజ్ అధికారులు కేవలం ముందు నుంచి సీల్ వేయడం వల్ల వెనుక వైపు దర్జాగా అక్రమార్కులు తమ పని కానిచ్చేస్తున్నారు. కొన్ని మద్యం దుకాణాలకు వెనుక వైపు నుంచి దారి లేదు. అలాంటి మద్యం దుకాణదారులు యథేచ్చగా సీల్‌ను తొలగించి మళ్లీ వేస్తున్నారు. దీని వెనుక స్థానిక ఎక్సైజ్ శాఖ అధికారుల హస్తం ఉందని ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే.. తాళానికి సీల్ వేయడమంటే.. కేవలం కాగితంపై సంతకం చేసి అతికిస్తున్నారు. దీన్ని యథావిధిగా తీసి మళ్లీ సంతకం చేసి అధికారులు అతికిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు పెద్దమొత్తంలోనే ముడుపులు ముడుతున్నాయన్నది అసలు విషయం. ఏదీ ఏమైనా అక్రమంగా మద్యం సరఫరా చేసేవారికి కరోనా వైరస్ కాసుల పంట పండిస్తోందనే చెప్పాలి.

బ్లాక్ మార్కెట్‌లో ప్రస్తుతం మద్యం బాటిళ్ల ధరలు ఇవే..
మద్యం పేరు                     ధర(రూపాయల్లో)మెక్ డోవెల్స్ విస్కీ             2500
రాయల్ స్టాగ్ విస్కీ            3000
రాయల్ ఛాలెంజ్ విస్కీ   3500
బ్లెండర్స్ ప్రైడ్                     4000
బ్లాక్ డాగ్, 100 పైపర్స్       5000
ప్రీమియం బీరు                 250
స్ట్రాంగ్ బీరు                         300
First published: April 15, 2020, 5:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading