హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Liquor Business: ఒక్క రోజే రూ.210 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు.. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌

Liquor Business: ఒక్క రోజే రూ.210 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు.. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌

28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించారు. 2019 నుండి 2021 వరకు రెండు దశల్లో నిర్వహించిన ఈ సర్వేలో 15 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలు పాల్గొన్నారు.

28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించారు. 2019 నుండి 2021 వరకు రెండు దశల్లో నిర్వహించిన ఈ సర్వేలో 15 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలు పాల్గొన్నారు.

Corona Lockdown | ఒక వైపు క‌రోనా కార‌ణంగా రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్ష‌లు విధిస్తున్నాయి. త‌మిళ‌నాడులో వీకెండ్ లాక్‌డౌన్ విధించింది. త‌మిళ‌నాడు (Tamil Nadu) లో 10 నెల‌ల త‌ర్వాత లాక్‌డౌన్ అమ‌లు చేశారు.

ఇంకా చదవండి ...

ఒక వైపు క‌రోనా (Corona) కార‌ణంగా రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్ష‌లు విధిస్తున్నాయి. త‌మిళ‌నాడులో వీకెండ్ లాక్‌డౌన్ విధించింది. త‌మిళ‌నాడు (Tamil Nadu) లో 10 నెల‌ల త‌ర్వాత లాక్‌డౌన్ అమ‌లు చేశారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో త‌మిళ‌నాడులో మ‌ద్యం అమ్మ‌కాలు జోరందుకున్నాయి. ఒక్క రోజులో రూ.210 కోట్ల విలువైన మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్టు అధికార వ‌ర్గాలు చెప్పాయి. సాధార‌ణంగా వీకెండ్ (Weekend) రెండు రోజుల్లో రూ.300 కోట్ల అమ్మ‌కాలు జ‌రుగుతాయి. అయితే లాక్‌డౌన్ (Lockdown) కార‌ణంగా ఒక్క రోజే రూ.210 కోట్ల అమ్మ‌కాలు జ‌రిగాయి.

పెరుగుతున్న కేసులు..

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు (Corona Cases) రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి. తమిళనాడులో శనివారం 10,978 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. చెన్నైలో మాత్ర‌మే 5,098 కేసులు నమోదయిన‌ట్టు అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో చెన్నైలో మాత్ర‌మే కాదు కాంచీపురం, తిరువ‌ళ్లూర్ జిల్లాలో 25శాతంపైగా మ‌ద్యం విక్ర‌యాలు జ‌రుగిన‌ట్టు అధికార వ‌ర్గాలు తెలిపాయి.

Supreme Court: 150 మంది సుప్రీం కోర్టు సిబ్బందికి క‌రోనా.. ఢిల్లీలో ఒక్క రోజే 20,000 కేసులు


దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఇప్ప‌టికే కేసులు సంఖ్య భారీగా పెరిగి. రోజు వారీ కేసులు సంఖ్య 20,000పైన వ‌స్తున్నాయి. తాజాగా ఈ కోవిడ్ దెబ్బ సుప్రీం కోర్టుకు తాకింది. 150మంది సుప్రీం కోర్టు సిబ్బందికి క‌రోనా పాజిటీవ్ వ‌చ్చిన‌ట్టు ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే పార్ల‌మెంట్‌లో ఇప్ప‌టికే 400మంది కోవిడ్ బారిన ప‌డ్డారు. సుప్రీం కోర్టు సిబ్బందిలో 5శాతం వైర‌స్ బారిన ప‌డ్డారు.

Fridge Organization Ideas: మీ ఫ్రిజ్‌లో సిద్ధంగా ఉంచుకోవాల్సిన 10 ఆహార ప‌దార్థాలు ఇవే!


ఒమిక్రాన్ వ్యాప్తి నేప‌థ్యంలో సుప్రీం కోర్టు (Supreme Court) ప్రాంగ‌ణంలో క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. 3,000 మందికి పైగా సుప్రీం కోర్టు సిబ్బంది ఉన్నారు. తాజాగా క‌రోనా ప‌రీక్ష‌లో 150 మందికి పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు సుప్రీం కోర్టు అధికార వ‌ర్గాలు తెలిపాయి.

Omicron: 24 గంట‌ల్లో 264% పెరిగిన ఆక్సిజ‌న్ వినియోగించే పేషెంట్ల సంఖ్య‌!


త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే రాష్ట్రం పంజాబ్‌ (Punjab) లో కోవిడ్ కేసులు బాగా పెరగడమే కాకుండా.. గ‌డిచిన‌ 24 గంటల్లో ఆక్సిజన్ తీసుకునే రోగుల సంఖ్య పెరగడం ఆందోళనకు కారణం. శనివారం విడుదల చేసిన రాష్ట్ర మెడికల్ బులెటిన్ ప్రకారం, శుక్రవారం కేవలం 62 మంది రోగులకు ఆక్సిజన్ సపోర్ట్‌ (Oxygen Support) లో 226 మంది ఉన్నారు. ఇది కేవలం 24 గంటల్లో 264% పెరిగింది. జనవరి 1న కేవలం 23 మంది రోగులు మాత్రమే ఆక్సిజన్ సపోర్ట్‌లో ఉన్నారు.

First published:

Tags: Corona cases, Covid 19 restrictions, Liquor sales, Lock down, Tamil nadu

ఉత్తమ కథలు