పాపం.. గిర్ అడవుల్లో గడ్డి తింటున్న సింహం..

గుజరాత్‌లోని గిర్ అడవుల్లో విచిత్రం చోటుచేసుకుంది. ఓ సింహం పచ్చి గడ్డిని తింటూ కొందరి కంట పడింది. దీన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి నెట్టింట్లో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్ అయ్యింది.

news18-telugu
Updated: August 29, 2019, 6:14 PM IST
పాపం.. గిర్ అడవుల్లో గడ్డి తింటున్న సింహం..
సింహం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సింహం.. అడవికి మృగరాజు. గంభీరమైన చూపు, జూలు, బలిష్ఠమైన శరీరం, రాజసమైన గర్జన.. దానికి ఠీవి. దాన్ని చూస్తేనే గుండెల్లో దడ పుడుతుంది. పచ్చి నెత్తురును కళ్ల జూసి రక్తపు ముద్దలను జుర్రుకుని కడుపు నింపుకుంటుంది. మాంసం కనిపిస్తే చాలు.. కసితీరా నమిలేసే వ్యక్తిత్వం దానిది. కానీ.. గుజరాత్‌లోని గిర్ అడవుల్లో విచిత్రం చోటుచేసుకుంది. ఓ సింహం పచ్చి గడ్డిని తింటూ కొందరి కంట పడింది. దీన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి నెట్టింట్లో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్ అయ్యింది. అయితే.. సింహాలు మాంసం తిన్న తర్వాత వాటి జీర్ణ వ్యవస్థ ఇబ్బందిని ఎదుర్కొంటుందని.. దాన్నుంచి ఉపశమనం పొందేందుకు, జీర్ణవ్యవస్థను క్లీన్ చేసుకోవడానికి అలా గడ్డిని తింటాయని పేర్కొన్నారు నెటిజన్లు.


First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com