Home /News /national /

LINKING YOUR MOBILE NUMBER TO AADHAAR CARD IS MANDATORY FOR COVID 19 VACCINATION DRIVE SS

Aadhaar Card: వ్యాక్సిన్ కోసం మీ ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయాలి... ఈ స్టెప్స్ ఫాలో అవండి

Aadhaar Card: వ్యాక్సిన్ కావాలంటే మీ ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయాలి... ఈ స్టెప్స్ ఫాలో అవండి
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card: వ్యాక్సిన్ కావాలంటే మీ ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయాలి... ఈ స్టెప్స్ ఫాలో అవండి (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card - Covid-19 Vaccine | మీ ఆధార్ కార్డుకు మీ మొబైల్ నెంబర్ లింక్ అయిందా? కోవిడ్ 19 వ్యాక్సిన్ కావాలంటే ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి.

    Aadhaar Card - Covid-19 Vaccine: దేశవ్యాప్తంగా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ఈరోజే మొదలైంది. వ్యాక్సిన్ తీసుకుంటున్నవారిని ట్రాక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్లాట్‌ఫామ్ రూపొందించింది. ఆధార్ నెంబర్ల ద్వారా వ్యాక్సిన్ తీసుకున్నవారిని ట్రాక్ చేస్తుంది. ఇందుకోసం Co-Win డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసింది. మొదటి డోసు తీసుకున్నవారిని గుర్తించి వారికి రెండో డోసు ఇచ్చేందుకు ఆధార్ నెంబర్లను ఉపయోగించుకోనుంది. అంటే మొదటి డోసు తీసుకోగానే కోవిన్ ప్లాట్‌ఫమ్‌లో డిజిటల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. ఈ సర్టిఫికెట్ రెండో డోసు కోసం రిమైండర్‌లా పనిచేస్తుంది. రెండో డోసు పూర్తైన తర్వాత ఫైనల్ సర్టిఫికెట్ వస్తుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆధార్ నెంబర్లను ఉపయోగించుకోనుంది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సిన్ తీసుకున్నవారినికి గుర్తించేందుకు ఆధార్ నెంబర్ ఉపయోగపడుతుంది.

    Aadhaar PVC Card: పాన్ కార్డ్ సైజులో ఆధార్ కార్డ్... సింపుల్‌గా ఆర్డర్ చేయండి ఇలా

    Aadhaar Card: గుడ్ న్యూస్... ఇక ఈ మార్పులన్నీ ఆన్‌లైన్‌లోనే... ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు

    మీరు ఇప్పటికే మీ మొబైల్ నెంబర్‌ను ఆధార్ కార్డుకు లింక్ చేసినట్టైతే ఇక మీరేం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఏ మొబైల్ నెంబర్ లింక్ చేశారో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసి స్టెప్స్ ఫాలో అవండి. ఇక మీ మొబైల్ నెంబర్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఆఫ్‌లైన్‌లో చేయాలంటే ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలి. ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలనుకుంటే స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ ఎలా బుక్ చేయాలో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. ఇక ఆన్‌లైన్‌లో మొబైల్ నెంబర్ లింక్ చేయడానికి ఐవీఆర్ఎస్ పద్ధతి పాటించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి.

    Aadhaar Card: మీ ఆధార్ కార్డులో ఏదైనా సమస్య ఉందా? ఈ నెంబర్‌కు కాల్ చేయండి

    Aadhaar-PAN: మీ పాన్ కార్డు, ఆధార్ కార్డులో పేర్లు వేర్వేరుగా ఉంటే సరిచేయండి ఇలా

    ముందుగా మీ మొబైల్ నెంబర్ నుంచి 14546 నెంబర్‌కు కాల్ చేయండి.
    ఐవీఆర్ఎస్‌లో ఇండియన్ లేదా ఎన్ఆర్ఐ అని సెలెక్ట్ చేయండి.
    మీ ఆధార్ రీవెరిఫై చేసేందుకు సమ్మతి ఇచ్చేందుకు 1 ప్రెస్ చేయండి.
    మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, 1 ప్రెస్ చేసి కన్ఫామ్ చేయండి.
    ఓటీపీ జనరేట్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
    మీ పేరు, ఫోటో, పుట్టిన తేదీ లాంటి వివరాలను ఆపరేటర్ యాక్సెస్ చేసేందుకు సమ్మతి ఇవ్వాలి.
    ఆ తర్వాత ఐవీఆర్ మీ మొబైల్ నెంబర్‌లోని నాలుగు అంకెల్ని చదివి వినిపిస్తుంది.
    కరెక్ట్ అయితే మీ ఓటీపీ ఎంటర్ చేయండి.
    ఆ తర్వాత 1 ప్రెస్ చేసి ప్రాసెస్ పూర్తి చేయండి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Aadhaar, Aadhaar card, AADHAR, UIDAI

    తదుపరి వార్తలు