Home /News /national /

LIKE LORD SHIVA WHO HELD POISON IN THROAT PM NARENDRA MODI ENDURED PAIN FOR 19 YRS SAYS AMIT SHAH ON GUJARAT 2002 RIOTS SK

PM Narendra Modi: శివుడు విషాన్ని దిగమింగినట్లుగా.. మోదీ 19 ఏళ్ల పాటు వేదన అనుభవించారు: అమిత్ షా

నరేంద్రమోదీ, అమిత్ షా (ఫైల్ ఫోటో)

నరేంద్రమోదీ, అమిత్ షా (ఫైల్ ఫోటో)

Amit Shah On 2022 Gujarat Riots case: శివుడు తన గొంతులో గరళాన్ని నింపుకున్నట్లుగానే.. ప్రధాని మోదీ కూడా 19 ఏళ్ల పాటు గుజరాత్ అల్లర్ల వేదనను అనుభవించారని కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా.. బాధను దిగమింగుకున్నారని చెస్పారు

ఇంకా చదవండి ...
    2002 గుజరాత్ అల్లర్ల కేసు (Gujarat Riots 2002 case)లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సహా 62 మందికి శుక్రవారం సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో.. నాటి హింసాత్మ ఘటనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) స్పందించారు. శివుడు తన గొంతులో గరళాన్ని నింపుకున్నట్లుగానే.. ప్రధాని మోదీ కూడా 19 ఏళ్ల పాటు ఈ వేదనను అనుభవించారని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా.. బాధను దిగమింగుకున్నారని చెస్పారు. మోదీ పడిన బాధను తాను దగ్గరి నుంచి చూశానని ఆయన పేర్కొన్నారు. ANI వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు అమిత్ షా.

    Gujarat Riots Case: గుజరాత్ అల్లర్ల కేసు.. ప్రధాని నరేంద్ర మోదీకి సుప్రీంకోర్టు క్లీన్ చిట్

    ''గుజరాత్ అల్లర్లపై కొందరు విషప్రచారం చేశారు. ఉద్దేశ్వపూర్వకంగా నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. కానీ తనపై వచ్చిన ఆరోపణలపై 19 ఏళ్లుగా మోదీ ఒక్క మాట మాట్లాడలేదు. శివుడు తన గొంతులో విషాన్ని నింపుకున్నట్లుగా.. మోదీ కూడా ఆ బాధను దిగమింగారు. ఆయన పడుతున్న వేదనను నేను చాలా దగ్గరి నుంచి చూశాను. గుజరాత్ అల్లర్ల కేసు కోర్టుల పరిధిలో ఉండటంతో ఒక్క మాట మాట్లాడలేదు. ఎంతో దృఢ సంకల్పం కలిగి ఉంటే తప్ప.. అంత మౌనంగా ఉండడం సాధ్యం కాదు. తప్పుడు ఆరోపలన నుంచి ఇప్పుడు మోదీ బయపడ్డారు. గుజరాత్ అల్లర్ల కేసులో ఆయన క్లీన్ చిట్ పొందడం శుభపరిణామం. సిట్ విచారణను మేం ప్రభావితం చేయలేదు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరిగింది. గుజరాత్ అల్లర్ల కేసు బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసింది. కానీ ఇప్పుడది తొలిపోయింనందుకు సంతోషంగా ఉంది.'' అని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.





    2002 గుజరాత్ అల్లర్ల కేసు (Gujarat Riots Case 2002)లో అప్పటి సీఎం నరేంద్ర మోదీ (PM Narendra Modi) సహా 62 మందికి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తే దాఖలైన పిటిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఉత్తర్వులను సమర్థిస్తూ.. వారందరికీ మరోసారి క్లీన్ చిట్ ఇచ్చింది. గుజరాత్ అల్లర్ల కేసులో సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ.. దివంగత కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జఫ్రీ భార్య జకియా ఆఫ్రీ (Zakia Jarri) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఐతే ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. గతంలో ప్రత్యేక మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జారీ చేసిన ఆదేశాలతో తాజాగా జస్టిస్ ఏ.ఎం. ఖన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ఏకీభవించింది. కాగా, 2002లో గుజరాత్‌లో మూడు రోజుల పాటు జరిగిన అల్లర్లలో వెయ్యి మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Amit Shah, Bjp, Gujarat, PM Narendra Modi

    తదుపరి వార్తలు