టిక్ టాక్ నిషేధాన్ని తప్పుబట్టిన ఎంపీ.. నోట్ల రద్దు నిర్ణయం వంటిదే..

టిక్ టాక్ ఎంటర్‌టైన్మెంట్ యాప్ అని.. దాన్ని నిషేధించడం హఠాత్తు పరిణామం అని విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దు లాగే ఇది కూడా అనాలోచిత నిర్ణయమని విరుచుకుపడ్డారు నుస్రత్ జహాన్.

news18-telugu
Updated: July 1, 2020, 7:15 PM IST
టిక్ టాక్ నిషేధాన్ని తప్పుబట్టిన ఎంపీ.. నోట్ల రద్దు నిర్ణయం వంటిదే..
బెంగాలీ నటి, ఎంపీ నుస్రత్ జహాన్ (Lok Sabha TV)
  • Share this:
ఇప్పుడు దేశవ్యాప్తంగా టిక్ టాక్ గురించే చర్చ జరుగుతోంది. టిక్ టాక్‌తో పాటు 59 చైనా యాప్స్‌ను నిషేధించడంతో.. టిక్ టాక్ స్టార్లు షాక్ తిన్నారు. తమకు ఇబ్బంది కలిగినప్పటికీ.. దేశ భద్రత దృష్ట్యా మంచి నిర్ణయమే తీసుకున్నారని చాలా మంది యూజర్లు కేంద్ర నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఐతే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మాత్రం తీవ్రంగా తప్పుబట్టారు. టిక్ టాప్‌ను నిషేధించినందుకు కేంద్రంపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టిక్ టాక్ ఎంటర్‌టైన్మెంట్ యాప్ అని.. దాన్ని నిషేధించడం హఠాత్తు పరిణామం అని విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దు లాగే ఇది కూడా అనాలోచిత నిర్ణయమని విరుచుకుపడ్డారు నుస్రత్ జహాన్.

టిక్ టాక్ వినోదాత్మకమైన యాప్. ఇది హఠాత్ పరిణామం. నిషేధం వెనక ఉన్న వ్యూహమేంటి? నిరుద్యోగులుగా మారిన యువత పరిస్థితేంటి? గతంలో విధించిన పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు ఎంతో నష్టపో​యారు. ఇప్పడు టిక్‌టాక్‌ను నిషేధించటం వల్ల కూడా అంతే స్థాయిలో ప్రజలు నష్టపోతారు. జాతీయ భద్రతకు భంగం కలుగుతుందని నిషేధించారు. ఇందులో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు?
నుస్రత్ జహాన్, టీఎంసీ ఎంపీ




కాగా, టిక్ టాక్ సహా మొత్తం 59 చైనీస్ అప్లికేషన్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. విస్తృత డిజిటల్ మార్కెట్‌గా అవతరించిన భారతదేశంలో కోట్లాది భారతీయుల గోప్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని.. చైనా యాప్స్‌తో దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పుందని ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం పేర్కొంది. వీటిని దుర్వినియోగం చేస్తూ, డౌటా చౌర్యంతో పాటు విదేశాల్లో సర్వర్లకు అనధికారికంగా డేటాను తరలిస్తున్నారన్న సమాచారం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే చైనీస్ యాప్స్‌ను దేశంలో నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
First published: July 1, 2020, 7:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading