హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Lightning Strikes: ఘోర విషాదం... ప్రాణాలు తీసిన పిడుగులు... 26 మంది బలి

Lightning Strikes: ఘోర విషాదం... ప్రాణాలు తీసిన పిడుగులు... 26 మంది బలి

Lightning Strikes: వర్షం పడుతున్నప్పుడు బయటకు వెళ్లొద్దని పేరెంట్స్ చెబుతున్నా... కొంత మంది పిల్లలు మాట వినకుండా బయటకు వెళ్తారు. ఈ వార్త చదివితే మాత్రం ఇంకెప్పుడూ వెళ్లరు.

  Lightning Strikes: విషాదకరం... ఈ మధ్య భూకంపాల కంటే... పిడుగుల వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో సోమవారం భారీ వర్షం కురిసింది. అదే సమయంలో... చాలా ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులూ వచ్చాయి. పిడుగులు పడ్డాయి. దాంతో... అలర్ట్ అయిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ అధికారులు... పిడుగుల వల్ల ఏదైనా సమస్య తలెత్తిందా అని ఎంక్వైరీ చేస్తే... మొత్తం 26 మంది చనిపోయారని తేలింది. వారిలో ఏకంగా 11 మంది ఒక్క హుగ్లీ జిల్లాలోనే చనిపోయారు. ముషీరాబాద్‌లో మరో 9 మంది... బంకురా, తూర్పు మిడ్నపూర్, పశ్చిమ మిడ్నపూర్ లోనూ ఇద్దరేసి చొప్పున ప్రాణాలు విడిచారు. గుండె నొప్పి వస్తే... ఆస్పత్రికి తీసుకెళ్లి బతికించే అవకాశాలు ఉంటాయి. అదే పిడుగు పడితే మాత్రం క్షణాల్లో చనిపోతారు. అందుకే మృతుల సంఖ్య ఇంత ఎక్కువగా ఉంది.

  విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ.50,000 పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటాము. నా ఆలోచనలు ఎప్పుడూ వారితోనే ఉంటాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి అని మోదీ ట్వీట్ చేశారు.

  పరిహారానికి సంబందించి... ప్రధానమంత్రి కార్యాలయం... ఓ ట్వీట్ పోస్ట్ చేసింది.

  కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు.

  సోమవారం బెంగాల్‌లోని చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం పడింది. ఈదురు గాలులు వచ్చాయి. నైరుతీ రుతుపవనాలకు ముందు ఇలా వర్షాలు కురవడం అక్కడ సహజమే. కోల్‌కతాలో నిన్న 37.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో ఉక్కపోత ఎక్కువై... సాయంత్రం 12 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఇవాళ కూడా కోల్‌కతాలో మేఘాలున్నాయి. వర్షం లేదా పిడుగుల వర్షం కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.

  ఇది కూడా చదవండి: AP News: ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ లేఖ... 4 పేజీల్లో ఏం రాశారంటే...

  ఈ సంవత్సరం నైరుతీ రుతుపవనాలు వచ్చాక... ఉత్తర బెంగాల్‌లో, ఉప హిమాలయ జిల్లాలైన డార్జిలింగ్, అలీపూర్‌ద్వార్‌లో.. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.

  First published:

  Tags: Heavy Rains, West Bengal

  ఉత్తమ కథలు