Home /News /national /

LIFTING TO INCREASE THE HEIGHT OF THE TEMPLE HOW MANY FEET THE HEIGHT WILL BE INCREASED IF YOU READ IT IT WILL BE AMAZING

Kuttanad Temple: ఇది అద్భుతమనే అనాలి.. గుడి ఎత్తు పెంచేందుకు లిఫ్టింగ్ .. ఎన్ని అడుగుల మేర ఎత్తు పెంచుతున్నారంటే..!

 ఆ గుడి ఎత్తు పెంచేందుకు లిఫ్టింగ్ .. ఎన్ని అడుగుల మేర ఎత్తు పెంచుతారంటే.. చదివితే అద్భుతం అంటారు !

ఆ గుడి ఎత్తు పెంచేందుకు లిఫ్టింగ్ .. ఎన్ని అడుగుల మేర ఎత్తు పెంచుతారంటే.. చదివితే అద్భుతం అంటారు !

ప్రస్తుత వర్షాకాలం(Rainy season) సీజన్‌ దేశవ్యాప్తంగా కుంభవృష్టికి కారణమవుతోంది. చాలా రాష్ట్రాల్లో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురుస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో వరదలు(Floods) సాధారణంగా మారాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు, నిర్మాణాలకు కొంత ఎత్తుకు లిఫ్టింగ్ చేస్తున్నారు. ?

ఇంకా చదవండి ...
ప్రస్తుత వర్షాకాలం సీజన్‌ దేశవ్యాప్తంగా కుంభవృష్టికి కారణమవుతోంది. చాలా రాష్ట్రాల్లో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురుస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో వరదలు సాధారణంగా మారాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు, నిర్మాణాలకు కొంత ఎత్తుకు లిఫ్టింగ్ చేస్తున్నారు. తాజాగా కేరళ(Kerala)లోని ఒక పురాతన ఆలయాన్ని లిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. కొచ్చి(Kochi)లోని కుట్టనాడ్‌ ప్రాంతాన్ని 2018లో వరదలు ముంచెత్తాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వరదల్లో ఇల్లు చిక్కుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ప్రస్తుతం కుట్టనాడ్‌లో ఇప్పటికే ఉన్న ఇళ్లు, నిర్మాణాలను లిఫ్టింగ్ విధానంలో నేలమట్టం నుంచి ఎత్తుకు పెంచుతున్నారు. వరద నుంచి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు ఆధ్వర్యంలో కుట్టనాడ్‌లోని ఒక ఆలయాన్ని(Temple) కూడా భూమి నుంచి ఎత్తుకు లిఫ్ట్ చేస్తున్నారు.

భద్రకాళి దేవత కొలువైన శతాబ్దాల నాటి మంకొంబు శ్రీభగవతి ఆలయాన్ని భవిష్యత్తులో వరదలు ముంచెత్తకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న నేల మట్టం నుంచి ఆరు అడుగుల ఎత్తుకు లిఫ్ట్ (Lift)చేస్తున్నారు. గర్భగుడి, ప్రాంగణం, దాని చుట్టూ (నాలంబలం) నిర్మాణంతో కూడిన ఆలయాన్ని నేలమట్టం నుంచి ఎత్తుకు లేపే పనిని ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. 2018 ఆగస్టులో వరదలు వచ్చే వరకు కుట్టనాడ్ తాలూకాలోని ఈ ఆలయం ఎటువంటి పెద్ద సమస్యలను ఎదుర్కోలేదు. అప్పట్లో గుడి వరద నీటిలో మునిగిపోయింది. దాని ప్రాంగణం నుంచి నీరు తగ్గడానికి 18 రోజులు పట్టింది. దీంతో అప్పటికే శిథిలావస్థలో ఉన్న ఆలయంలోని పాత లేటరైట్ రాతి గోడకు భారీ నష్టం వాటిల్లింది.

పనులకు దాదాపు రూ.1.5 కోట్లు అవసరం
ఆలయ సలహా కమిటీ కార్యదర్శి పి సత్యశీలన్‌ నాయర్‌ మాట్లాడుతూ..‘వరదలు వచ్చిన తరువాత, ఆలయం చుట్టూ ఉన్న నివాసితులు తమ భవనాలను నేలమట్టం నుంచి పైకి లిఫ్టింగ్ చేస్తూ ఎత్తు పెంచడం ప్రారంభించారు. ఆలయ ప్రాంగణం మాత్రం అదే స్థాయిలో ఉంది. దీంతో సమీప ప్రాంతాల నుంచి నీరు, వ్యర్థ జలాలు ఆలయ ప్రాంగణంలోకి ప్రవహించడం ప్రారంభించాయి. 2018 తర్వాత ఆలయంలో ప్రతి సంవత్సరం తొమ్మిది నెలల పాటు నీరు నిలిచిపోతోంది. దీనివల్ల పాత లేటరైట్ ఇటుకలు వేగంగా నశిస్తాయి. కాంపౌండ్‌లో మూడు, నాలుగు అడుగుల ఎత్తులో నీరు ఉంటుంది. ఆలయ నిర్మాణానికి ఎలాంటి భంగం కలగకుండా నేల మట్టం నుంచి ఎత్తు పెంచుతున్నాం’ అని తెలిపారు.

ఇదీ చదవండి: Twitter Spaces: ట్విట్టర్ యూజర్స్ కు అదిరిపోయే న్యూస్.. అందుబాటులో కొత్త ఫీచర్.. వాళ్లకు మాత్రమే!

లిఫ్టింగ్ పనిలో ఆలయ పునాదిని పెంచడం, నాలంబలం లేటరైట్ రాతి గోడను కృష్ణశిలతో తిరిగి నిర్మించే పనులు చేపడతారు. కృష్ణశిల తమిళనాడు నుంచి రవాణా అవుతోంది. ఆలయాన్ని లిఫ్ట్‌ చేసేందుకు దాదాపు రూ.1.5 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. భక్తులు సమర్పించే విరాళాలతో పనులు జరుగుతున్నాయి.నిర్మాణంలో మార్పులు జరగవు
ఆలయాన్ని లిఫ్ట్‌ చేసే ఏజెన్సీ అయిన EDSS వెంచర్స్ లిమిటెడ్ CEO జోస్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. ‘ఏజెన్సీ ఇప్పటికే నాలంబలంలోని లేటరైట్ రాళ్లను తొలగించింది. మా పనిలో గుడి కింద 30 మీటర్ల లోతు వరకు తవ్వి పటిష్ఠం చేస్తాం. అది అదనపు భారాన్ని భరించేలా చేస్తుంది. అధిక సంపీడన బలం కలిగిన 2,988 కస్టమైజ్డ్‌ ఇటుకలను ఉపయోగించి మొత్తం 3,494 చదరపు అడుగుల ప్రాంతాన్ని ఆరు అడుగుల ఎత్తుకు పెంచుతాం. లిఫ్టింగ్‌లో దాదాపు 1,300 టన్నుల అదనపు లోడ్ ఉంటుంది. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రాంగణంలో (తిరుముట్టం) వేసిన శిలాఫలకాలను ఎత్తివేసే సమయంలో విడదీసి, ఎత్తిన తర్వాత మళ్లీ వేస్తారు. పని ప్రారంభించే ముందు నాలంబలం గోడ బలాన్ని పరీక్షించాం. దాని పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. పనిలో భాగంగా నిర్మాణం, ప్రాంగణం పరిమాణంలో ఎటువంటి మార్పులు జరగవు.’ అని చెప్పారు.
Published by:Mahesh
First published:

Tags: Kerala, Kerala floods, Pinarayi Vijayan, Sabarimala Temple

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు