కేంద్రం సంచలన నిర్ణయం: దేశంలోని ప్రతీ కంప్యూటర్‌పై నిఘా

కేంద్ర హోంశాఖ ఇచ్చిన అనుమతులతో.. దర్యాప్తు సంస్థలు దేశంలోని ఏ కంప్యూటర్‌లో దాచి ఉంచిన సమాచారాన్నైనా పరిశీలించే అధికారం ఉంది. ఎన్‌క్రిప్ట్‌లో ఉన్న డేటాను సైతం డిక్రిప్ట్ చేసి పరిశీలించడానికి వారికి అనుమతినిచ్చింది.

news18-telugu
Updated: December 21, 2018, 1:14 PM IST
కేంద్రం సంచలన నిర్ణయం: దేశంలోని ప్రతీ కంప్యూటర్‌పై నిఘా
కేంద్ర హోంశాఖ ఇచ్చిన అనుమతులతో.. దర్యాప్తు సంస్థలు దేశంలోని ఏ కంప్యూటర్‌లో దాచి ఉంచిన సమాచారాన్నైనా పరిశీలించే అధికారం ఉంది. ఎన్‌క్రిప్ట్‌లో ఉన్న డేటాను సైతం డిక్రిప్ట్ చేసి పరిశీలించడానికి వారికి అనుమతినిచ్చింది.
  • Share this:
కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశంలోని ప్రతీ కంప్యూటర్‌పై నిఘా పెట్టాలని నిర్ణయించింది. వ్యక్తిగత సమాచారాన్ని కూడా పరిశీలించే అధికారాన్ని దర్యాప్తు సంస్థలకు ఇచ్చింది. ఇందుకు సంబంధించి దేశంలోని 10 దర్యాప్తు సంస్థలకు కేంద్ర హోంశాఖ అనుమతులిచ్చింది. దర్యాప్తు సంస్థలకు సహకరించనివారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

కేంద్ర హోంశాఖ అనుమతులిచ్చిన వాటిల్లో ఐబీ, సీబీఐ, ఈడీ, రా, ఎన్ఐఏ, డీఆర్ఐ, ఐబీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టోరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటలిజెన్స్, రెవెన్యూ ఇంటలిజెన్స్, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 69(1),2000 కింద కేంద్ర హోంశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దేశ సమగ్రత, భద్రత, రక్షణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

కేంద్ర హోంశాఖ ఇచ్చిన అనుమతులతో.. దర్యాప్తు సంస్థలు దేశంలోని ఏ కంప్యూటర్‌లో దాచి ఉంచిన సమాచారాన్నైనా పరిశీలించే అధికారం ఉంది. ఎన్‌క్రిప్ట్‌లో ఉన్న డేటాను సైతం డిక్రిప్ట్ చేసి పరిశీలించడానికి వారికి అనుమతినిచ్చింది. అయితే వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో... కాంగ్రెస్ పార్టీ కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది.

ఇది కూడా చదవండి: ఆధార్‌ అడిగితే కోటి జరిమానా... కేంద్రం సంచలన నిర్ణయం
Published by: Srinivas Mittapalli
First published: December 21, 2018, 12:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading