భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాదు ప్రపంచ దేశాల బాగు కోసం కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పాటుపడుతున్నారు. అంతర్జాతీయ నాయకత్వంలో మోదీ చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అందుకే మన ప్రధానిని చాలా దేశాలు అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించాయి. ఈరోజు (సెప్టెంబర్ 17)న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మోదీ తన పదవీ కాలంలో వివిధ దేశాల నుంచి ఎన్ని గౌరవ పురస్కారాలు (International Honorary Awards) అందుకున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
* జాయెద్ అవార్డు - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2019లో మోదీని జాయెద్ అవార్డుతో గౌరవించింది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించినందుకు గానూ ఈ అవార్డును అందించింది. యూఏఈ వ్యవస్థాపక పితామహుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరు మీదగా ఈ అవార్డుకు ఆ పేరు వచ్చింది.
* కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్
2016, ఏప్రిల్ 3న నరేంద్ర మోదీకి సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్ (King Abdulaziz Sash) అనే అత్యున్నత పౌర పురస్కారం అందజేసింది. రాయల్ కోర్ట్‌లో కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ చేతుల మీదగా ప్రధాని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు పొందారు. మోడర్న్ సౌదీ రాజ్య స్థాపకుడు అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ పేరు మీద ఈ అవార్డుకి ఆ పేరు వచ్చింది.
* ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ - రష్యా
ప్రధాని మోదీ రష్యా , భారత్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడంలో విశేషమైన సహకారాన్ని అందించారు. ఆ సహకారానికి గుర్తింపుగా 2019లో నరేంద్ర మోదీకి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డును రష్యా ప్రధానం చేసింది. రష్యా, భారత ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను ప్రోత్సహించడంలో అసాధారణమైన సేవలను అందించినందుకు గానూ మోదీకి రష్యా అత్యున్నత పురస్కారం ఇచ్చినట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.
* ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు - ఐక్యరాజ్యసమితి
భారతదేశంలో పర్యావరణాన్ని రక్షించేందుకు మోదీ అనేక చర్యలను చేపడుతున్నారు. ఆ విధంగా ప్రపంచ పర్యావరణాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2022 నాటికి భారతదేశంలో సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలిస్తానని మోదీ ప్రతిజ్ఞ కూడా చేశారు. అందుకే 2018లో ఐక్యరాజ్యసమితి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రదానం చేసింది.
ఇది కూడా చదవండి :స్ఫూర్తినింపే ప్రధాని మోదీ ఫేమస్ క్వోట్స్‌లో టాప్ 10 ఇవే..
* సియోల్ శాంతి బహుమతి - దక్షిణ కొరియా
అంతర్జాతీయ సహకారానికి, ప్రపంచ ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి చేసిన కృషికి 2018లో సియోల్ శాంతి బహుమతిని ప్రధాని మోదీ అందుకున్నారు.
* లెజియన్ ఆఫ్ మెరిట్ - యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
2020లో మోదీ అమెరికా నుంచి లెజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు అందుకున్నారు. భారతదేశ నాయకుడిగా విశేషమైన సేవ అందిస్తున్నందుకు ఈ అవార్డును ప్రధానం చేశారు.
* న్గదాగ్ పెల్ గి ఖోర్లో - భూటాన్
2021లో భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన న్గదాగ్ పెల్ గి ఖోర్లో (Ngadag Pel gi Khorlo) అవార్డును భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ ప్రధాని మోదీకి అందజేశారు.
* కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసన్స్ - బహ్రెయిన్
మోదీని 2019లో బహ్రెయిన్ దేశం కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్‌తో సత్కరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra Modi Birthday, National News, PM Narendra Modi