• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • LESS OXYGEN UNITS MAKING OXYGEN CYLINDERS SHUT DOWN SA

Oxygen Cylinders:ఇదేం ఖర్మరా 'బాబు'.. ఆక్సిజన్ సిలిండర్ల తయారీ యూనిట్ల షట్​డౌన్​..

Oxygen Cylinders:ఇదేం ఖర్మరా 'బాబు'.. ఆక్సిజన్ సిలిండర్ల తయారీ యూనిట్ల షట్​డౌన్​..

కరోనా తీవ్రంగా ఉన్న సందర్భంగా జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు మంత్రి హరీష్ రావు ఏర్పట్లు చేస్తున్నారు

మెడికల్​ ఆక్సిజన్​ కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే ఆక్సిజన్​ ?

  • Share this:


    దేశంలో కరోనా ఉధృతి రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో దేశవ్యాప్తంగా ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఫలితంగా మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడింది.​ ఈ నేపథ్యంలో మెడికల్​ ఆక్సిజన్​ కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే ఆక్సిజన్​ సిలిండర్​ తయారీ కేంద్రాలపై తాత్కాలిక నిషేధం విధించింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఆక్సిజన్​ను వాణిజ్య అవసరాలకు ఉపయోగించరాదని, కేవలం మెడికల్​ ఆక్సిజన్​ మాత్రమే ఉత్పత్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత 10 రోజులుగా, దేశంలోని అతిపెద్ద ఆక్సిజన్ సిలిండర్ తయారీ యూనిట్లలో వాటి ఉత్పత్తి నిలిచిపోయింది. దేశంలోని దాదాపు మూడోవంతు ఆక్సిజన్​ సిలిండర్లు గుజరాత్‌లోని గాంధీధామ్‌లో తయారవుతాయి. ఈ పరిశ్రమలు మూతపడటంతో తీవ్ర కొరత ఏర్పడుతోంది.

    సిలిండర్ తయారీ యూనిట్లు కేవలం ద్రవ ఆక్సిజన్ మాత్రమే సరఫరా చేయాలని ఏప్రిల్ 27న హోం శాఖ స్పష్టత ఇచ్చినప్పటికీ, ఈ పరిశ్రమలపై నిషేధం ఇంకా ఎత్తివేయలేదు. ఈ నిషేధంపై ఆల్​ ఇండియా ఇండస్ట్రియల్​ గ్యాసెస్​ మ్యానుఫాక్చరర్స్​ అసోసియేషన్​ (ఎఐఐజిఎంఎ) ప్రతినిధులు స్పందించారు. వారు మాట్లాడుతూ.. ‘గాంధీధామ్‌లోని స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)లో ఉన్న ఆక్సిజన్​ ఉత్పత్తి యూనిట్లలో దేశంలోనే మూడింట రెండు వంతుల ఆక్సిజన్ సిలిండర్ల ఉత్పత్తి జరుగుతుంది. అయితే ప్రభుత్వం విధించిన నిషేధం కారణంగా ఆక్సిజన్ సిలిండర్ల కొరత మరింత తీవ్రతరం అయ్యింది. మా పరిశ్రమలపై నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలి’ అని కోరారు.

    AIIGMA అధ్యక్షుడు సాకేత్ టికు మాట్లాడుతూ.. “కోవిడ్ సంక్షోభంతో గుజరాత్ రాష్ట్రంలో ఆక్సిజన్ డిమాండ్ రోజుకు 1,200-1,500 మెట్రిక్ టన్నుల (MT) మధ్య పెరిగింది. అయితే రాష్ట్రంలోని సిలిండర్ ప్లాంట్లు అన్నీ కలిపినా అవి రోజుకు కేవలం 11 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఉత్పత్తి చేయగలవు. అందువల్ల మా పరిశ్రమలపై నిషేధం ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరాం. కానీ ప్రభుత్వ నుంచి స్పందన లేదు” అని వాపోయారు. ఇక, ఆక్సిజన్​ సిలిండర్లు కావాలని తయారీదారులను ప్రతిరోజూ వందలాది మంది కోరుతున్నారు. కానీ వారి అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం అడ్డంకిగా మారిందని యజమానులు అంటున్నారు.

    ఆక్సిజన్​ సిలిండర్లకు బారీ డిమాండ్..​
    సెజ్‌లో అతిపెద్ద సిలిండర్ల తయారీ సంస్థ ఎవరెస్ట్ కాంటో సిలిండర్ లిమిటెడ్ మార్కెటింగ్ మేనేజర్ సారంగ్ గాంధే దీనిపై స్పందించారు. తమ ప్లాంట్​కు నెలకు సుమారు 35,000 సిలిండర్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. కానీ ప్రభుత్వం విధించిన నిషేధం కారణంగా ఆర్డర్లు రద్దు చేయవలసి వస్తుందని చెప్పారు. ‘ఒరిస్సా, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్​, ఢిల్లీ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు సిలిండర్ల కోసం మాపై ఆధారపడ్డాయి. కాని ఇక్కడి ప్లాంట్ మూసివేయాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇప్పుడు మాకంటే మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ధర పెట్టి ఆక్సిజన్ సిలిండర్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది” అని పేర్కొన్నారు. సిలిండర్ తయారీదారులను నిషేధం నుంచి మినహాయించాలని MHA ఇటీవల సూచనలు జారీ చేసింది. గుజరాత్​ రాష్ట్ర అధికారులు మాత్రం ఈ ఆదేశాలను అమలు చేయడం లేదని వారు చెబుతున్నారు.
    First published:

    అగ్ర కథనాలు