నిన్న హిమాచల్ ప్రదేశ్ ఏటీఎంలో చిరుత పులి పిల్ల వెళ్లగా...తాజాగా మహారాష్ట్రలోని ఓ ఇంటి బాత్ రూంలోకి వెళ్లింది చిరుత పులి. దీంతో అక్కడ జనం భయాభ్రాంతులకు గురయ్యారు. అది పాల్ఘర్ జిల్లాలోని దండి గ్రామం. సమయం రాత్రి 9.30 గంటలవుతుంది. వాతావరణం చల్లగా ఉండటంతో అందరూ చలికి ఇళ్లలోనే తలుపులేసుకొని ఉన్నారు. ఇంతలో విజయ్ తామోర్ అనే వ్యక్తి బాత్రూంకు వెళ్దామని బయటకొచ్చాడు. అంతే ఇంటి బయట సంచరిస్తున్న చిరుత నుంచి షాక్ అయిపోయాడు. ఆ చిరుత ఎక్కడ తన ఇంట్లోకి వెళ్తుందోనని భయపడిపోయి.. నెమ్మదిగా దాన్ని బాత్రూరంలోకి వెళ్లేటట్లు చేశాడు. అంతే చిరుత అల బాత్ రూంలోకి వెళ్లగానే లాక్ చేశాడు.
అమ్మో పులి ... బాబోయ్ పులి అంటూ గట్టిగా కేకలు పెట్టాడు. విజయ్ అరుపులు విన్న ఇరుగు పొరుగు, గ్రామస్థులంతా అక్కడకు చేరుకున్నారు. ఏమందంటూ ప్రశ్నిచారు. దీంతో చిరుత వచ్చిన విషయాన్ని ఊరివాళ్లకు చెప్పాడు. వాళ్లంతా కలిసి రాత్రి 10 గంటల సమయంలో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు మూడు గంటల పాటు శ్రమించి చిరుత పులిని బాత్ రూం నుంచి క్షేమంగా బయటకు తీశారు. దీంతో గ్రామస్థులంతా ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఈ ప్రాంతంలో చిరుతల సంచారం కొత్తం కాదంటున్నారు అటవీ శాఖ అధికారులు. దగ్గర్లోనే అటవీ ప్రాంతం ఉండటంతో అప్పుడప్పుడు ఇలా పులులు జనావాసాల్లోకి వస్తుంటాయని చెబుతున్నారు. గతనెల పూణె జిల్లాలో తల్లి చేతుల్లో ఓ చిన్నారిని చిరుత ఎత్తుకెళ్లి చంపేసింది. సోనవాడి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇలా అనేక ప్రాంతాల్లో చాలా సార్లు చిరుత పులులు దాడులకు పాల్పడిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఇవికూడా చదవండి:
పంజాబ్లో విషాదం....కుక్క దాడిలో మూడోతరగతి చిన్నారి మృతి
బాలికల్ని కిడ్నాప్ చేసి తన కోరిక తీర్చమంటున్నాడు... ఆ కోరిక ఏంటంటే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maharashtra, National News, Tiger Attack