• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • LEOPARD ATTACK VIDEOS LEOPARD ENTERED INTO PETROL PUMP AND TRY TO KILL DOG VIDEO GOES VIRAL NK

Leopard Videos: సిటీలోని పెట్రోల్ బంకుకి వచ్చిన చిరుతపులి... ఏం చేసిందో తెలుసా?

Leopard Videos: సిటీలోని పెట్రోల్ బంకుకి వచ్చిన చిరుతపులి... ఏం చేసిందో తెలుసా?

సిటీలోని పెట్రోల్ బంకుకి వచ్చిన చిరుతపులి...(image credit - twitter)

Leopard Attack Videos: ఆ చిరుత పులి అంతపని చేస్తుందని ఎవరూ ఊహించలేదు. అసలు అక్కడకు చిరుతపులి వస్తుందని ఎవరు అనుకుంటారు...?

  • Share this:
    Leopard Attack Videos: మన చిన్నప్పుడు చిరుతపులులు ఎక్కడ ఉంటాయంటే... అడవుల్లో, జూలలో అని చెప్పుకునేవాళ్లం. ఇప్పుడు అలా కాదు. చిరుతపులులు లేని ప్రదేశం కనిపించట్లేదు. పల్లెల్లోకే కాదు... పట్టణాలు, సిటీల్లోకి కూడా చిరుతపులులు వచ్చేస్తున్నాయి. పులులైనా కాస్తంతా ఆగుతున్నాయి కానీ... చిరుతలు మాత్రం సన్నగా కరెంటు తీగలా ఉంటూ... జనం దగ్గరకు వచ్చి షాకులిస్తున్నాయి. గుజరాత్... సూరత్ నగరంలోకి తరచూ చిరుతపులులు వస్తూనే ఉంటాయి. అందువల్ల అక్కడి ప్రజలు నిరంతరం అప్రమత్తంగానే ఉంటున్నారు. తాజాగా... సూరత్‌లోని... పాల్ సూరత్ ఏరియాకి ఓ చిరుతపులి వచ్చింది. ఓ పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్లింది. అక్కడున్న రెండు CCTV కెమెరాలు పులిని వీడియో తీశాయి.

    పెట్రోల్ బంక్ వెనక ఓ గోడ ఉంది. చిరుతపులి ఆ గోడను దూకి లోపలికి వచ్చింది. అక్కడ సీసీ కెమెరా లేకపోవడంతో... గోడ దూకిన దృశ్యం రికార్డ్ కాలేదు. ఆ పెట్రోల్ బంక్ దగ్గర కుక్కలు ఉన్నాయి. వాటిలో ఓ కుక్కను తిందామని చిరుతపులి ప్లాన్ వేసుకుంది. అందులో భాగంగానే గోడ దూకి లోపలికి వచ్చింది. చిరుతపులి నడిచేటప్పుడు కాళ్ల సౌండ్ రాదు. అందువల్ల మన వెనక నుంచి మన దగ్గరకు చిరుత నడుస్తూ వస్తున్నా, మనం వెనక ఎవరో వస్తున్నారని గుర్తించలేం. ఇక్కడా అదే జరిగింది. ఆ చిరుత తన దగ్గరకు వస్తున్న విషయం ఆ కుక్కకు తెలియదు. కుడుతున్న దోమల్ని తిట్టుకుంటూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తోంది. ఇంతలో దగ్గరకు వెళ్లిన చిరుత పంజా దెబ్బ వేద్దామా, డైరెక్టుగా కొరికేద్దామా అనుకూంటూ... కొరకడానికే ఫిక్సై దగ్గరకు రాగానే... సరిగ్గా అప్పుడే కుక్కకు వాసన వచ్చి... అది కళ్లు తెరిచింది. ఎదురుగా చిరుత.

    కుక్కకు ఒక్క క్షణం గుండె ఆగిపోయింది. వెంటనే చిరుత కొరికేందుకు ఉరికింది. కుక్క తప్పించుకుంది. పెనుగులాట జరిగంది. కుక్క లేని శక్తి కూడగట్టుకంటూ... గట్టిగా అరుస్తూ... ఉండటంతో... చిరుతకు డౌట్ వచ్చింది. ఆ అరుపులకు జనం నిద్రలేస్తే... తనకు మూడుతుందని అనుకుంది. నెక్ట్స్ టైమ్ చూసుకుంటా అనుకుంటూ... అక్కడి నుంచి వెళ్లిపోయింది. బతికాన్రా దేవుడా అనుకుంటూ ఆ కుక్క అక్కడి నుంచి పారిపోయింది. వీడియో చూడండి.


    ఇప్పుడా బంక్‌లో రాత్రివేళ పనిచేసే ఉద్యోగి రావడం మానేశాడు. ఒకసారి వచ్చిన చిరుత మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుందని అతను అంటున్నాడు. ఇలా అడవుల్లో ఆహారం దొరక్క చిరుతపులులు ఊళ్లలోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు గుజరాత్‌లో బాగా జరుగుతున్నాయి.
    Published by:Krishna Kumar N
    First published: