Legion of Merit Award to PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా ప్రసిద్ధ అవార్డ్

ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా ప్రసిద్ధ అవార్డ్ (File image - courtesy - twitter)

Legion of Merit Award to PM Narendra Modi: ఈ అవార్డ్ ఎలాంటిది? దీన్ని ప్రధాని నరేంద్ర మోదీకి ఎందుకు ఇచ్చారు? ఈ అవార్ట్ ఇవ్వాలని డొనాల్ట్ ట్రంప్ ఎప్పుడు అనుకున్నారు?

  • Share this:
    Legion of Merit Award to PM Modi: అవార్డులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కొత్త కాదు. కాకపోతే... ఈసారి ఆయన్ని ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు వరించింది. అమెరికా సైన్యం అందించే బెస్ట్ అవార్డుల్లో ఇది ఒకటి. అదే ‘లెజియన్‌ ఆఫ్‌ మెరిట్’‌ అవార్డ్. దీన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం ఇచ్చారు. ఐతే... ఈ అవార్డును డైరెక్టుగా అమెరికా వెళ్లి ప్రధాని మోదీ తీసుకోలేదు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రయాన్‌ నుంచి మోదీ తరఫున అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధు ఈ అవార్డును తీసుకున్నారు. ప్రపంచ దేశాల్లో ఎంతో మంది ప్రధానులు, అధ్యక్షులూ ఉండగా... మన ప్రధానికి ఈ అవార్డ్ ఎందుకు ఇచ్చారు?

    భారత్-అమెరికా స్నేహ బంధం:
    భారత్‌-అమెరికా వ్యూహాత్మక బంధాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాని మోదీ చూపిన చొరవకు అమెరికా ఫిదా అయ్యింది. అందుకే ఆయనకు ఈ అవార్డు ఇచ్చారని రాబర్ట్ ఓబ్రయాన్‌ తెలిపారు. ఈ అవార్డు వల్ల దేశాధినేతలకు ఇచ్చే చీఫ్ కమాండర్‌ హోదా ఇప్పుడు మోదీని వరించింది. మోదీతో పాటు ఈ అవార్డును ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే కూడా పొందారు. ఆస్ట్రేలియా మొదటి నుంచి అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. జపాన్ అయితే... పూర్తిగా అమెరికాతో స్నేహంగా ఉంటూనే... వాణిజ్యపరంగా రెండు దేశాల మధ్యా బంధం బలపడేలా చేసుకుంటోంది. సైన్యంతో పాటు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతానికి కృషి చేసిన దేశాధినేతలకు అమెరికా ఈ అవార్డును అందిస్తూ ఉంటుంది.


    ఇది కూడా చదవండి: Bath Benefits: రోజూ స్నానం చేస్తే ఆరోగ్యానికి మేలు.. 2 సార్లు చేస్తే అదిరిపోయే ప్రయోజనం

    ఎన్నో అవార్డులు:
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇది వరకు కూడా చాలా దేశాల నుంచి ఆయా దేశాల బెస్ట్ అవార్డులు వచ్చాయి. 2016లో సౌదీ అరేబియా... అబ్దులాజిజ్‌ అల్‌ సౌద్‌ అవార్డు, అఫ్గానిస్థాన్‌ నుంచి అమీర్‌ అబ్దుల్లా ఖాన్‌ అవార్డు, 2018లో సియోల్‌ పీస్‌ ప్రైజ్‌, రష్యా నుంచి ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూ ది అపోజిల్‌ అవార్డు, UAE నుంచి జాయెద్‌ మెడల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుకున్నారు. ఇప్పుడు కూడా కరోనా వైరస్ లేకపోయి ఉంటే... ప్రధాని మోదీ అమెరికా వెళ్లి అవార్డు పొందే అవకాశాలు ఉండేవే.
    Published by:Krishna Kumar N
    First published: