పోలీసులకు షాక్... సెలవులు రద్దు

Ayodhya Case Verdict : అయోధ్య కేసు తీర్పు రాబోతుండటంతో... మధ్యప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. పోలీసులకు సెలవులు రద్దు చేసింది.

news18-telugu
Updated: November 3, 2019, 7:26 AM IST
పోలీసులకు షాక్... సెలవులు రద్దు
పోలీసులకు షాక్... సెలవులు రద్దు
  • Share this:
Ayodhya Case Verdict : అయోధ్య కేసులో తీర్పు ఎలా ఉండబోతోంది? ఎవరికి అనుకూలంగా ఉంటుంది? ఎవరికి వ్యతిరేకంగా ఉంటుంది? తీర్పుతో అయోధ్య సమస్యకు పరిష్కారం లభిస్తుందా? ఇలా ఎన్నో సందేహాలు అయోధ్య కేసుపై ఉన్నాయి. దీనిపై త్వరలోనే తీర్పు ఇచ్చి సందేహాలకు చెక్ పెట్టబోతోంది సుప్రీంకోర్టు. అయితే... కోర్టు తీర్పు ఏ ఒక వర్గానికో అనుకూలంగా ఉంటే... మరో వర్గం నుంచీ వ్యతిరేక నినాదాలు, ఆందోళనలూ జరగొచ్చన్న ఉద్దేశంతో అప్రమత్తమైన మధ్యప్రదేశ్ ప్రభుత్వం... పోలీసులకు సెలవులు రద్దు చేసింది. తాము మళ్లీ చెప్పేవరకూ... ఎవరూ సెలవులు తీసుకోవద్దని పోలీస్ శాఖ ఆర్డరేసింది. అసలే పోలీసులకు సెలవులు చాలా తక్కువ. తాజా నిర్ణయం అక్కడి పోలీసులకు బాధ కలిగించే అంశమే.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టులో ఐదుగురు జడ్జిల బెంచ్... సెప్టెంబర్, అక్టోబర్‌లో 40 రోజులపాటూ వాదనలు వింది. తీర్పు ఇవ్వకుండా రిజర్వులో పెట్టింది. ఐతే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఈ నెల 17న రిటైరవుతున్నా్రు. ఆలోపే ఆయన చరిత్రాత్మక తీర్పు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఐతే... తీర్పు అడ్డం తిరిగితే... యూపీతోపాటూ... పక్క రాష్ట్రమైన తమపైనా ఎఫెక్ట్ పడుతుందనుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం... పోలీసులకు సెలవులు రద్దు చెయ్యడం ద్వారా అప్రమత్తంగా ఉన్న సంకేతాలిచ్చింది.

ఇప్పుడు మధ్యప్రదేశ్ పోలీసులకు నవంబర్ 1 నుంచీ సెలవులు రద్దైనట్లైంది. ఆ ప్రభావం వారితోపాటూ... వారి కుటుంబ సభ్యులపైనా పడుతుంది. తీర్పు రావడానికి మరో రెండు వారాల టైమ్ ఉందనుకుంటే... తీర్పు వచ్చిన తర్వాత అల్లర్ల వంటివి జరిగితే... అవి ఎప్పటికి కంట్రోల్ అవుతాయో ముందే చెప్పలేం. అంటే... పోలీసులకు సెలవుల రద్దు ఎన్నాళ్లు కొనసాగుతుందో అంచనా వెయ్యలేని పరిస్థితి ఉందనుకోవచ్చు.

 

Pics : కేతిక శర్మ అందాల వర్షంలో తడిసి ముద్దైపోవాల్సిందే
ఇవి కూడా చదవండి :IND vs BAN | నేడు ఇండియా బంగ్లాదేశ్ తొలి టీ20... పొగే సమస్య

కేసీఆర్ లెక్క తప్పింది... అంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారో...

నేడే లాంగ్ మార్చ్... సిద్ధమైన జన సైనికులు... ఇసుక తుఫానేనా?

Diabetes Diet : డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో తినగలిగే పండ్లు


Diabetes Tips : పసుపుతో డయాబెటిస్‌కి చెక్... ఎలా వాడాలంటే...
First published: November 3, 2019, 7:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading