Home /News /national /

LEADERS OF FARMERS UNIONS ANNOUNCED THAT UNION HOME MINISTER AMIT SHAH HAD INVITED THE FARMERS TO COME FOR TALKS AND WOULD STOP THE MOVEMENT IF THE TALKS WERE SUCCESSFUL PRV

Farmers protest:  ‘‘అమిత్​షా చర్చలకు పిలిచారు.. ఆ డిమాండ్లకు ఒకే చెబితే రైతు ఉద్యమాన్ని ఆపేస్తాం”:  రైతు సంఘాల నేతలు​

టికాయత్​ (photo:ANI/Twitter)

టికాయత్​ (photo:ANI/Twitter)

వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసిన అనంతరం రైతు సంఘాల నేతలు మాత్రం తమ ఆందోళనలు కొంతకాలం వాయిదా వేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో రైతు సంఘాల నాయకులు (Leaders of farmer associations) కేంద్రంతో చర్చలకు సిద్ధమయ్యారు.

కొత్త వ్యవసాయ చట్టాలకు (New agricultural laws) వ్యతిరేకంగా రైతులు ఏడాది కాలంగా ఆందోళనలు (Famers Protest) చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యూపీకి చెందిన రైతులు ఢిల్లీ శివారులో శిబిరాలను ఏర్పాటు చేసుకొని నిరసనలను కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉద్యమం (Famers Protest) జరిగినా అప్పట్లో కేంద్రం స్పందించలేదు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. అయితే దేశవ్యాప్తంగా బీజేపీ (BJP)కి ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడం, మరోవైపు రైతులు కూడా ఉద్యమాన్ని (Famers Protest) ఆపకపోవడంతో కేంద్రం దిగొచ్చింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది. ఈ మేరకు పార్లమెంట్​ (Parliament)సైతం రద్దు బిల్లులను ఆమోదించింది. దీనిపై రాష్ట్రపతి సైతం ఆమోదముద్ర వేశారు. అయితే రైతు సంఘాల నేతలు మాత్రం తమ ఆందోళనలు కొంతకాలం వాయిదా వేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో రైతు సంఘాల నాయకులు (Leaders of farmer associations) కేంద్రంతో చర్చలకు సిద్ధమయ్యారు.

ఐదుగురు సభ్యులతో ప్రతినిధి బృందం..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Union Minister Amit shah) గత రాత్రి చర్చలకు రావాలని తమను ఆహ్వానించారని.. చర్చలు విజయంతమైతే ఉద్యమాన్ని ఆపేస్తామని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు.  ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాన్ని ( SKM has formed a 5-member committee) సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. కనీస మద్దతు ధరపై కేంద్రంతో ఈ బృందం చర్చలు జరపనుంది. రాకేశ్‌ టికాయత్‌తో పాటు గుర్నామ్‌సింగ్‌, బల్బీర్‌సింగ్‌ రాజేవాల్‌, అశోక్‌ ధావ్లే, శివకుమార్‌, యుద్‌వీర్‌సింగ్‌‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. సంయుక్త కిసాన్ మోర్చా (SKM) తదుపరి సమావేశం డిసెంబర్ 7వ తేదీన జరుగుతుందని రాకేశ్ టికాయత్ (Rakesh Tikayath) చెప్పుకొచ్చారు.



సాగుచట్టాల రద్దు (Repeal of three agricultural laws) రైతుల విజయమని భారతీయ కిసాన్ యూనియన్ లీడర్ రాకేశ్ టికాయత్ అన్నారు. కమిటీని ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరిగిందన్న విమర్శలను ఆయన తప్పుపట్టారు. కేంద్రమే మూడు సాగు చట్టాల రద్దును ఆలస్యం చేసిందని విమర్శించారు.



పార్లమెంట్‌లో మూడు వ్యవసాయ చట్టాల రద్దు (Repeal of three agricultural laws) బిల్లును కేంద్రం ఆమోదించిన వారంలోపు సంయుక్త కిసాన్ మోర్చా తదుపరి సమావేశం జరగనుండటంతో.. ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైతులపై పెట్టిన కేసుల ఎత్తివేత , కనీస మద్దతు ధర , ఢిల్లీ శివార్లలో చనిపోయిన 702 మంది రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించే వరకు ఉద్యమం కొనసాగుతుందని సంయుక్త కిసాన్‌ మోర్చా స్పప్టం చేసింది
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Farmers Protest, New Agriculture Acts

తదుపరి వార్తలు