PM Modi Birthday : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)ఇవాళ తన 72వ వసంతంలోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్ 17,1950న గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని వాద్‌నగర్‌లో నరేంద్రమోదీ జన్మించారు. మోదీ 72వ పుట్టినరోజు(Modi Birthday)సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి ప్రపంచ నేతల వరకు ఆయనకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారత రాష్ట్రతి ద్రౌపది ముర్ము ఓ ట్వీట్ లో.."ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. సాటిలేని కఠోర శ్రమ, అంకితభావం, సృజనాత్మకతతో మీరు చేపడుతున్న దేశ నిర్మాణ సంగ్రామం మీ నాయకత్వంలో కొనసాగాలని కోరుకుంటున్నాను. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును ప్రసాదించాలని కోరుకుంటున్నాను"అని పేర్కొన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Shah) చేసిన వరుస ట్వీట్ లలో.."దేశ అభిమాన నాయకుడు, మనందరికీ స్ఫూర్తి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షు పొందాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మోడీ జీ మొదటి ఆలోచన భారతదేశం, పేదల సంక్షేమం కోసం సంకల్పంతో అసాధ్యమైన పనులను సుసాధ్యం చేశారు. సురక్షితమైన, దృఢమైన, స్వావలంబన కలిగిన నూతన భారతదేశాన్ని సృష్టికర్త నరేంద్రమోదీ జీ జీవితం సేవ, అంకితభావానికి ప్రతిరూపం.స్వాతంత్య్రానంతరం తొలిసారిగా కోట్లాది మంది పేదలకు వారి హక్కులను కల్పించడం ద్వారా మోదీ జీ వారిలో ఆశ, విశ్వాసాన్ని నింపారు. నేడు దేశంలోని ప్రతి వర్గాలూ మోదీకి అండగా నిలుస్తున్నాయి. భారతీయ సంస్కృతి యొక్క వాహకం నరేంద్రమోదీ దేశాన్ని దాని అసలు మూలాలకు అనుసంధానం చేస్తూ ప్రతి రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు జీ కృషి చేశారు. మోదీజీ దార్శనికత మరియు నాయకత్వంలో నూతన భారతదేశం ప్రపంచ శక్తిగా అవతరించింది. ప్రపంచం మొత్తం గౌరవించే గ్లోబల్ లీడర్‌గా మోడీ జీ తనదైన ముద్ర వేశారు"అని పేర్కొన్నారు.
"'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' రూపశిల్పి, 'అంత్యోదయ' కోసం నిరంతరం దేశ ఆరాధనలో నిమగ్నమై, విజయవంతమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు.శ్రీ రాముని పరమ ఆరాధకురాలు, మా భారతీ, గౌరవనీయులైన ప్రధాన మంత్రికి దీర్ఘాయువు, మంచి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించుగాక"అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ ట్వీట్ లో మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ ట్వీట్ లో ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా,ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రధాని మోదీ జన్మదినాన్ని ‘సేవా దివస్’గా జరుపుకుంటుంది. దీని కింద ప్రజాసేవకు సంబంధించిన అనేక ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సారి కూడా ప్రధాని మోడీ తన పుట్టిన రోజు నాడు చాలా బిజీబిజీగా గడుపనున్నారు. వన్యప్రాణులు మరియు పర్యావరణం, మహిళా సాధికారత, నైపుణ్యం మరియు యువత అభివృద్ధి, తదుపరి తరం మౌలిక సదుపాయాలకు సంబంధించిన నాలుగు వేర్వేరు కార్యక్రమాలలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీ తన పుట్టిన రోజు సందర్భంగా తొలుత తన తల్లి నుండి ఆశీర్వాదం తీసుకుని.. అనంతరం మధ్య ప్రదేశ్ కు చేరుకోనున్నారు. అక్కడ కునో నేషనల్ పార్క్‌లో నమీబియా నుండి తీసుకువచ్చిన చిరుతలను విడిచిపెడతారు. ప్రధాని మోడీ తన పుట్టిన రోజు సందర్భంగా తొలుత తన తల్లి నుండి ఆశీర్వాదం తీసుకుని.. అనంతరం మధ్య ప్రదేశ్ కు చేరుకోనున్నారు. అక్కడ కునో నేషనల్ పార్క్‌లో నమీబియా నుండి తీసుకువచ్చిన చిరుతలను విడిచిపెడతారు.
Modi Birthday: పూజలు, కేక్ కట్టింగ్ కాదు... ఈ సారి ఇన్ని రకాలుగా మోదీ బర్త్ డే.. ఫుల్ డిటెయిల్స్
ప్రపంచంలోనే టాప్ పవర్‌ఫుల్ లీడర్స్‌లో ఒకరైన మోదీ ఆస్తి ఎంతో తెలిస్తే ఎవరైనా, సరే.. అవాక్కవ్వాల్సిందే. మోదీకి ప్రస్తుతం స్థిరాస్తులంటూ (Immovable Property) ఏవీ లేవు. కొంతకాలం క్రితం సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని రెసిడెన్షియల్ ప్లాట్‌లో ఉన్న ఒక్కగానొక్క తన ల్యాండ్ వాటాను విరాళంగా అందించారు. దాంతో ఇప్పుడు మోదీకి ఎలాంటి స్థిరాస్తి లేకుండా పోయింది. చరాస్తులు (Movable Assets) మాత్రం రూ.2.23 కోట్లకు పైగా ఉన్నాయి. వీటిలో ఎక్కువగా బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. గత నెలలో ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నుంచి వచ్చిన ప్రకటన ప్రకారం, 2021-22లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరాస్తులు రూ.26 లక్షలు పెరిగాయి. అంటే మార్చి 2021 చివరి నాటికి రూ.1,97,68,885గా ఉన్న మోదీ సంపద మార్చి 31, 2022 నాటికి రూ.2,23,82,504కి పెరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra Modi Birthday, Pm modi