ఢిల్లీలో పోలీసులు, లాయర్లు కొట్టుకున్నారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు, న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులు పరస్పరం దాడులు చేశారు. దాంతో ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు రణరంగమైంది. లాయర్‌ను పోలీసులు చితకబాదారన్న ఆరోపణలతో పోలీసులపైకి న్యాయవాదులు ఎదురు తిరిగారు. పోలీస్ వాహనాలపై రాళ్లురువ్వి.. ఓ కారును తగులబెట్టారు. కవరేజీ కోసం వచ్చిన జర్నలిస్టులపై దాడి చేసినట్లు సమాచారం. వారి నుంచి ఫోన్లు, కెమెరాలు లాక్కున్నారని తెలుస్తోంది. పరిస్థితులు అదుపుతప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి.. కోర్టు ప్రధాన గేటుకు తాళం వేశారు.
కోర్టు ఆవరణలో పార్కింగ్ విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ తలెత్తింది. పార్కింగ్ ఏరియాలో ఓ లాయర్ వాహనాన్ని పోలీస్ వాహనం ఢీకొనడంతో వాగ్వాదం జరిగింది. ఆ లాయర్‌ను ఓ రూమ్‌లోకి తీసుకొని పోలీసులు చితకబాదారని తిస్ హజారీ బార్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. ఐదారు మంది పోలీసులు కలిసి చితకబాదారని.. ఇదేంటని అడిగితే తమపై దౌర్జన్యానినికి దిగారని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. పోలీసుల దాడిలో పలువురు లాయర్లు గాయపడ్డారు. వారిని సెయింట్ స్టీఫెన్స్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో తిస్ హజారీ కోర్టు వద్ద భద్రతా దళాలు భారీగా మోహరించాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.