Home /News /national /

LATE CDS GENERAL BIPIN RAWAT PRERECORDED LAST MSG PLAYED AT SWARNIM VIJAY PARV EVENT MKS

Gen Bipin Rawat చిట్టచివరి సందేశం -దుర్మరణానికి కొద్దిగంటల ముందు video

జనరల్ బిపిన్ రావత్ ఆఖరి సందేశం వీడియో

జనరల్ బిపిన్ రావత్ ఆఖరి సందేశం వీడియో

చనిపోవడానికి కొద్ది గంటల ముందు రికార్డు చేసిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ చిట్టచివరి సందేశాన్ని ఇండియన్ ఆర్మీ ఆదివారం నాడు విడుదల చేసింది. ‘ఈ ప్రత్యేక సందర్భంలో, నేను ధైర్యవంతులను స్మరించుకుంటాను. వారి త్యాగాలకు నా నివాళులర్పిస్తాను..’ అంటూ సీడీఎస్ చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి..

ఇంకా చదవండి ...
భారతదేశపు తొలి సర్వసైన్యాధ్యక్షుడు (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్-సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణ విషాదం నుంచి దేశం ఇంకా కోలుకోలేదు. సీడీఎస్ తోపాటు చనిపోయిన వీరుల అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. జనరల్ బిపిన్ రావత్ వ్యక్తిగత సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన జవాన్ సాయితేజ భౌతికకాయం ఆదివారం నాడు స్వగ్రామానికి చేరగా, అశృనయనాల మధ్య అంతిమయాత్ర కొనసాగింది. ఈనెల 8న తమిళనాడులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) హెలికాప్టర్ కుప్పకూలిన దుర్ఘటనలో రావత్, ఆయన సతీమణి మధులిక, జవాన్ సాయితేజ సహా వివిధ విభాగాలు, పలు ర్యాంకుల్లోని మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, చనిపోవడానికి కొద్ది గంటల ముందు రికార్డు చేసిన సీడీఎస్ చిట్టచివరి సందేశాన్ని ఇండియన్ ఆర్మీ ఆదివారం నాడు విడుదల చేసింది..

1971 యుద్దంలో దాయాది పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించి ఇప్పటికి 50ఏళ్లు కావొస్తోంది. ఏటా డిసెంబర్ 16ను భారత్ 'విజయ్ దివస్‌'గా జరుపుకుంటుంది. 1971లో ఇదే రోజు పాకిస్తాన్ సైన్యం భారత్ ముందు లొంగిపోవడంతో, 13 రోజులపాటు జరిగిన యుద్ధం ముగియడం, తద్వారా బంగ్లాదేశ్ కు విముక్తి లభించింది. ప్రతిష్టాత్మక విజయ్ దివస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి ఐదు రోజులపాటు కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. ఇవాళ(డిసెంబర్ 12 నుంచి ఈనెల 16(విజయ్ దివస్) వరకు ‘స్వర్ణిమ్ విజయ్ పర్వ్’ పేరుతో ఉత్సవాలు జరుగనున్నాయి. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదివారం నాడు ఢిల్లీలో అధికారికంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిజానికి ఈ వేదికపై సీడీఎస్ బిపిన్ రావత్ కూడా ఉండాల్సింది. కానీ..

Sweden girl: ముంబై స్లమ్ డాగ్ ప్రియుడి కోసం స్విడన్ బాలిక ఏం చేసిందో తెలిస్తే అవాక్కవుతారు..



షెడ్యూల్ ప్రకారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఇవాళ జరిగిన ‘స్వర్ణిమ్ విజయ్ పర్వ్’లో సీడీఎస్ రావత్ పాల్గొనాల్సింది. అదే సమయంలో దేశం నలుమూలల్లోని సైనికులను ఉద్దేశించి ఆయన సందేశం వెళుతుంది. ఇందుకుగానూ డిసెంబర్ 7న ఓ వీడియోను రికార్డ్ చేశారు. ఆ వీడియో రికార్డింగ్ తర్వాత కొద్ది గంటలకే, డిసెంబర్ 8న సీడీఎస్ ప్రాణాలు కోల్పోయారు. విజయ్ దివస్ సందర్భంగా రావత్ చిట్టచివరి వీడియో సందేశాన్ని ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది.



ఢిల్లీలో జరిగిన విజయ్ దివస్ కార్యక్రమంలో దివంగత జనరల్ బిపిన్ రావత్ చిట్టచివరి వీడియోను ఆర్మీ ప్రదర్శించింది. ‘స్వర్ణిమ్ విజయ్ పర్వ్ సందర్భంగా, భారత సైన్యంలోని వీర జవాన్లను నేను అభినందిస్తున్నాను. 1971 యుద్ధంలో భారతదేశం సాధించిన 50 సంవత్సరాలకు గుర్తుగా 'స్వర్ణిమ్ విజయ్ పర్వ్' జరుపుకుంటున్నాము. ఈ ప్రత్యేక సందర్భంలో, నేను ధైర్యవంతులను స్మరించుకుంటాను. వారి త్యాగాలకు నా నివాళులర్పిస్తాను..’అంటూ తన చిట్టచివరి సందేశంలో సీడీఎస్ రావత్ పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Bipin Rawat, Helicopter Crash, Indian Army

తదుపరి వార్తలు