Home /News /national /

LATE AT NIGHT FADNAVIS HOLDS 40 MINUTE MEETING WITH AJIT PAWAR NK

నేడు తేలనున్న మహారాష్ట్ర పంచాయతీ... సుప్రీంకోర్టు ఏం చెబుతుంది?

ఫడ్నవీస్ ఇంటికి వెళ్లిన అజిత్ పవార్

ఫడ్నవీస్ ఇంటికి వెళ్లిన అజిత్ పవార్

Maharashtra Politics : ఆదివారం ప్రత్యేకంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు... హడావుడిగా తీర్పు ఇచ్చేయకూడదని డిసైడైంది. అన్ని లెక్కలూ తేల్చాలనే ఉద్దేశంతో తీర్పు నిర్ణయాన్ని ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోందన్నది ఆసక్తిగా మారింది.

ఇంకా చదవండి ...
    Maharashtra Politics : మహారాష్ట్రలో బీజేపీ+అజిత్ పవార్ కూటమి సారధ్యంలో ప్రభుత్వం ఏర్పడినా... అది ఉంటుందో, ఊడుతుందో అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం... శివసేన, కాంగ్రెస్, శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ... సుప్రీంకోర్టును ఆశ్రయించడమే. ఆదివారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఎటూ తేల్చలేదు. మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మధ్య సాగిన లేఖల వివరాల్ని నేడు తమ ముందు ఉంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ... ఫడ్నవీస్‌కు ఎలాంటి లేఖ రాశారు? తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని గవర్నర్‌కు ఫడ్నవీస్ ఏమని లేఖ రాశారో పరిశీలించిన తర్వాత... గవర్నర్ నిర్ణయం రాజ్యాంగబద్ధమో కాదో ఇవాళ సుప్రీంకోర్టు తేల్చనుంది. ఐతే... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 24 గంటల్లోనే అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఫడ్నవీస్‌ను ఆదేశించాలని శివసేన కూటమి సుప్రీంకోర్టును కోరినా... అందుకు ఆదివారం సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. అంత హడావుడిగా బలనిరూపణకు పిలవాల్సిన పనిలేదని తేల్చింది. అందువల్ల ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెబుతుంది? ఏమని ఆదేశిస్తుంది? అన్నది రాజకీయంగా చర్చనీయాంశం.

    ఒకవేళ సుప్రీంకోర్టు ఇవాళే గవర్నర్ బలనిరూపణకు పిలవాలని ఆదేశిస్తే ఏం చెయ్యాలన్న అంశంపై గత రాత్రి ఫడ్నవీస్ ఇంటికి వెళ్లిన అజిత్ పవార్ 40 నిమిషాలపాటూ చర్చించారు. అజిత్‌పవార్‌కు మొదట్లో ఉన్నంత మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు సపోర్ట్‌గా లేరు. కారణం తమపై అనర్హత వేటు వేస్తారేమోనన్న భయం. అటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాత్రం... ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారనీ, ఇండిపెండెంట్ల సపోర్ట్ కూడా తమకు ఉందని ధీమాగా చెబుతున్నారు. అందువల్ల ఇప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉంటుందా? లేక అది కూలిపోయి, శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందా? లేక పరిస్థితి మొదటికి వచ్చి మళ్లీ రాష్ట్రపతి పాలన వస్తుందా అన్న సందేహాలున్నాయి.

    288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించింది. శివసేన 56 సీట్లు గెలిచింది. ఇక ఎన్సీపీ 54, కాంగ్రెస్ పార్టీ 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 145 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. బీజేపీకి 11 మంది ఇండిపెండెంట్ల మద్దతు ఉంది. అందువల్ల ఇంకా 29 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అంత మంది అజిత్ పవార్ వర్గం నుంచీ వస్తారా అన్నది తేలాల్సిన అంశం. అటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మూడూ కలిపి... 144 మంది సభ్యుల బలం ఉంది. కొందరు ఇండిపెండెంట్లు కూడా ఎన్సీపీకి సపోర్ట్ ఇస్తున్నారు. అందువల్ల ఆ కూటమి ప్రభుత్వం గట్టెక్కే ఛాన్స్ ఉంటుంది. కానీ... ఎన్సీపీలో రెబెల్స్ అందుకు సపోర్ట్ చేస్తారా అన్నది శరద్ పవార్‌ను వెంటాడుతున్న భయం. ఇలా మహారాష్ట్ర పంచాయతీ అల్లకల్లోలంగా తయారైంది.


    అక్క శిల్పా శెట్టి బాటలో చెల్లి షమితా శెట్టి



    ఇవి కూడా చదవండి :

    Health Tips : జుట్టు రాలకుండా చేసే అద్భుతమైన 7 చిట్కాలు

    Health Tips : నిమ్మకాయ తొక్కలతో ఎన్నో ప్రయోజనాలు... ఇలా చెయ్యండి...

    Health Tips : గొంతు గరగరగా ఉందా... ఇలా చెయ్యండి చాలు... సమస్య పరార్

    ఒక్క తులసి మొక్కను పెంచినా చాలు... ఆరోగ్యమే ఆరోగ్యం

    వేడి నీరు, నిమ్మరసంతో అద్భుతమైన 9 ప్రయోజనాలు
    First published:

    Tags: Maharashtra, Telugu news, Telugu varthalu

    తదుపరి వార్తలు