హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Lata Mangeshkar: లతా మంగేష్కర్‌కు ఘ‌న నివాళి.. సంతాపంగా ఎన్ని రాష్ట్రాలు సెల‌వు ప్ర‌క‌టించాయో తెలుసా?

Lata Mangeshkar: లతా మంగేష్కర్‌కు ఘ‌న నివాళి.. సంతాపంగా ఎన్ని రాష్ట్రాలు సెల‌వు ప్ర‌క‌టించాయో తెలుసా?

ల‌తా మంగేష్క‌ర్

ల‌తా మంగేష్క‌ర్

Lata Mangeshkar | భారతరత్న, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌ కన్నుమూసారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె.. స్వ‌ర్గ‌స్తుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు ఆయా రాష్ట్రాలు సెల‌వులు ఇచ్చి సంతాప దినాలుగా ప్ర‌క‌టించాయి.

ఇంకా చదవండి ...

  భారతరత్న, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌ (Lata Mangeshkar) కన్నుమూసారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె.. స్వ‌ర్గ‌స్తుల‌య్యారు. ఎన్నో వేల పాటలు పాడిన ఆ స్వరం ఇక మూగబోయిందని తెలిసి.. కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆమె అభిమానులు. కొన్ని రోజులుగా ఆమె నిమోనియా వ్యాధితో బాధ పడుతున్నారు. దాంతో స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తాయి. వెంటనే కుటుంబ సభ్యులు ముంబై (Mumbai) లోని ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించడంతో వైద్యులు కూడా ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. కరోనా (Corona) కూడా సోకడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆమె దేశ సంగీత రంగానికి ఎంతో సేవ చేశారు. ఈ నేప‌థ్యంలో ఆమె మృతికి సంతాపంగా దేశంలో 7 రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవులు ప్రకటించారు. ఆయన భౌతికకాయానికి నిన్న పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ముంబైలో అంత్యక్రియలు జరిగాయి.

  మహారాష్ట్ర..

  మహారాష్ట్రలో ఇవాళ ఒకరోజు రాష్ట్ర సెలవు ప్రకటించారు. ఆమె భౌతిక‌కాయానికి ముంబైలోని శివాజీ మైదాన్‌లో లతా మంగేష్కర్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. వీరిలో ముఖ్యమంత్రి ఉత్తమ్ ఠాక్రే కూడా ఉన్నారు.

  Medical Seat: మెడిక‌ల్ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ప్రైవేటు మెడిక‌ల్ కా..లేజీ ఫీజుల మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల‌

  పశ్చిమ బెంగాల్

  ఈరోజు ఒకరోజు సెలవును ప్రకటించిన పశ్చిమ బెంగాల్ (Bengal)  ప్రభుత్వం రాబోయే 15 రోజుల పాటు రాష్ట్ర కార్యక్రమాలలో లతా మంగేష్కర్ పాటలను ప్రసారం చేయాలని ఆదేశించింది.

  మధ్యప్రదేశ్

  మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2 రోజుల ప్రభుత్వ సెలవు ప్రకటించింది. ఈ 2 రోజుల పాటు త్రివర్ణ పతాకాన్ని సగానికి ఎగురవేయనున్నారు. లతా మంగేష్కర్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు.

  Police Station: క‌నిపించ‌కుండా పోయిన 62 పోలీస్టేష‌న్‌లు .. రంగంలోకి దిగిన పోలీసులు!

  కర్ణాటక

  కర్ణాటక ప్రభుత్వం 2 రోజుల ప్రభుత్వ సెలవు ప్రకటించింది. ఈరోజుల్లో రాష్ట్ర వేడుకలు నిర్వహించబోమని, జాతీయ జెండాను అర మాస్టారుకు ఎగురవేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మ ప్రకటించారు.

  గోవా

  గోవా ప్రభుత్వం 3 రోజుల రాష్ట్ర సెలవు ప్రకటించింది. ఈ రోజుల్లో త్రివర్ణ పతాకాన్ని సంగం మాత్ర‌మే ఎగురవేస్తున్నారు.

  Assembly Election 2022: వీడిన ఉత్కంఠ‌.. షాక్ ఇచ్చిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న

  ఈమె కెరీర్‌ (Career) లో ఇప్పటి వరకు 25 వేలకు పైగా సోలో పాటలు పాడి గిన్నీస్ రికార్డు సొంతం చేసుకున్నారు లతాజీ. దానికితోడు కాంబినేషన్ పాటలు ఇంకా వేలల్లో ఉన్నాయి. నైటింగిల్ ఆఫ్ ఇండియా అంటూ లతకు పేరుంది. భారత ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, భారత రత్న, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Goa, Lata Mangeshkar, Maharashtra, Mumbai, West Bengal

  ఉత్తమ కథలు