Home /News /national /

LATA MANGESHKAR ADMITTED TO HOSPITAL IN MUMBAI AFTER CONTRACTING COVID19 MKS

Lata Mangeshkar: ఐసీయూలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌

లతా మంగేష్కర్ (File/Photo)

లతా మంగేష్కర్ (File/Photo)

గాయని లతా మంగేష్కర్ కు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని లతా మంగేష్కర్‌ మేనకోడలు రచనా ద్రువీకరించారు.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరింది (covid surge in india). రోజువారీ కొత్త కేసులు లక్షన్నరకు పైగానే, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. కేంద్ర మంత్రులు, ఢిల్లీ పెద్దలు సైతం వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. భారత కొవిడ్ రాజధానిగా ఉంటోన్న ముంబై (Mumbai) నగరంలోనైనే రోజుకు 20వేల పైచిలుకు కేసులు వస్తున్నాయి. ఆ నగరంలోనే నివసిస్తోన్న ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌ (Lata Mangeshkar) కూడా కొవిడ్ సోకింది.

92 ఏళ్ల లతా మంగేష్కర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని లతా మంగేష్కర్‌ మేనకోడలు రచనా ద్రువీకరించారు. లతాదీకి స్వల్ప లక్షణాలతో కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని, అయితే, వయసు రీత్యా ముందు జాగ్రత్త కోసం మాత్రమే ఐసీయూలో ఉంచారని రచన పేర్కొన్నారు.

Pig Heart In Human: వైద్య చరిత్రలో అద్భుతం: మనిషికి పంది గుండె అమర్చిన డాక్టర్లు


దేశంలో ప్రస్తుతం కొవిడ్ మూడో వేవ్ కొనసాగుతుండగా, రాబోయే రోజుల్లో ఆస్పత్రిలో చేరికలు పెరగొచ్చనే కేంద్రం అంచనాలు నిజమవుతున్నాయి. లతా దీదీ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొనగా, మేనకోడలు రచన ట్వీట్ ద్వారా ఒకింత ఉపశమనం లభించినట్లయింది.

Covid విలయం: ఆస్పత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయి.. తస్మాత్ జాగ్రత్త: మోదీ సర్కార్ వార్నింగ్



2019లో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ లతా మంగేష్కర్‌ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. 1929,సెప్టెంబర​28న జన్మించిన లతా మంగేష్కర్ భారత అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్‌ ఫాల్కె, పద్మ భూషణ్, పద్మవిభూషణ్, సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇండియన్‌ నైటింగల్‌గా పేరు సంపాదించిన ఆమె ఇప్పటివరకు 50వేలకు పైగా పాటలు పాడారు.
Published by:Madhu Kota
First published:

Tags: Coronavirus, Covid, Latha Mangeshkar, Mumbai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు