Pensions: దేశవ్యాప్తంగా వేల మంది పెన్షనర్లకు మేలు చేసే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పెన్షన్ దారులు... తమ లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించేందుకు గడువును డిసెంబర్ 31 వరకూ పెంచుతూ... శుక్రవారం ప్రకటన చేసింది కేంద్రం. అందువల్ల "ప్రభుత్వ పెన్షన్ దారులంతా... తమ లైఫ్ సర్టిఫికెట్లు నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య సమర్పించవచ్చు" అని కేంద్ర వ్యక్తిగత, ప్రజా సమస్యలు, పెన్షన్ల శాఖ మంత్రి జితంద్ర సింగ్ తెలిపారు. ఇదివరకు ఇలాంటి సర్టిఫికెట్ను నవంబర్లో మాత్రమే సమర్పించాలనే రూల్ ఉండేది. అలా సమర్పించిన వారికే పెన్షన్ కంటిన్యూ చేసేవాళ్లు. ఇప్పుడు మరో నెల అదనంగా పొడిగించారు.
ఇంతకీ ఈ లైఫ్ సర్టిఫికెట్ అంటే ఏమిటనే డౌట్ రావచ్చు. ఇదేంటంటే... పెన్షన్ పొందాలనుకునేవారు... ప్రతి సంవత్సరం... నేను బతికే ఉన్నాను... నాకు పెన్షన్ కంటిన్యూ చెయ్యండి అంటూ... లైఫ్ సర్టిఫికెట్లో రాసి సమర్పిస్తారు. అలా సర్టిఫికెట్ ఇస్తేనే... బతికివున్నట్లుగా అధికారులు గుర్తిస్తారు. ఒకవేళ సర్టిఫికెట్ ఇవ్వకపోతే... అలాంటి వ్యక్తి స్వయంగా వెళ్లి... పెన్షన్ అడిగినా... "నువ్వు బతికే ఉన్నావని గ్యారెంటీ సర్టిఫికెట్ లేదు... కాబట్టి పెన్షన్ ఇవ్వలేం" అని అధికారులు చెబుతారు.
80 అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్లు... అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య తమ సర్టిఫికెట్లను సమర్పించవచ్చు. తద్వారా... పెన్షన్ ఎలాంటి బ్రేకూ లేకుండా వస్తూ ఉంటుంది. కరోనా వల్ల ముసలివాళ్లు ఇబ్బంది పడుతున్నారు కదా... వారిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈసారి గడువును పెంచింది.
పెన్షన్ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఇప్పుడు బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు. ఆన్లైన్లో కూడా వీడియో ద్వారా... కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ (V-CIP) ద్వారా కూడా సర్టిఫికెట్ ఇచ్చినట్లవుతుంది. బ్యాంకుల్లో ఉద్యోగులు ఈ విధానాన్ని జనవరి 9 నుంచి చేపడుతున్నారు.
Published by:Krishna Kumar N
First published:September 12, 2020, 08:50 IST