పీఓకె ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడులు.. నలుగురు ఉగ్రవాదులు మృతి

India Attack four terror launch pads in POK : ఈ ఏడాది సెప్టెంబర్ వరకు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ 2వేల పైచిలుకు సార్లు కాల్పులకు పాల్పడింది. పాక్ కాల్పుల్లో ఎంతోమంది సాధారణ పౌరులు,జవాన్లు గాయపడ్డారు.మరోవైపు భారత్ మాత్రం 2003 కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ కట్టుబడి ఉండాలని భారత్ పదేపదే విజ్ఞప్తి చేస్తోంది.

news18-telugu
Updated: October 20, 2019, 3:24 PM IST
పీఓకె ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడులు.. నలుగురు ఉగ్రవాదులు మృతి
భారత సైన్యానికి చెందిన ధనుష్ ఫిరంగి
  • Share this:
పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో ఒక సాధారణ పౌరుడు, ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. పాక్ దాడిని తిప్పికొట్టేందుకు భారత సైన్యం పీఓకె వెంబడి ఉన్న పాక్ ఉగ్రవాద క్యాంపులపై దాడులకు పాల్పడింది. భారత సైన్యం జరిపిన దాడుల్లో నలుగురు లష్కరే తోయిబా,జైషే మహమ్మద్ తీవ్రవాదులు మృతి చెందారు.పాక్ ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసేందుకు భారత సైన్యం ఫిరంగులను ఉపయోగించింది. పీఓకెలోని నీలమ్ లోయలో ఉన్న మొత్తం నాలుగు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది.

ఆదివారం ఉదయం కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న తంగ్‌ధర్ సెక్టార్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడింది. పాక్ నుంచి కొంతమంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ పాక్ చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై రగిలిపోతున్న పాకిస్తాన్.. ఇలా దాడులకు పాల్పడుతోంది. తంగ్‌ధర్ సెక్టార్‌లో పరిస్థితులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌తో మాట్లాడారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని ఆయన స్వయంగా సమీక్షిస్తున్నారు. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ వరకు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ 2వేల పైచిలుకు సార్లు కాల్పులకు పాల్పడింది. పాక్ కాల్పుల్లో ఎంతోమంది సాధారణ పౌరులు,జవాన్లు గాయపడ్డారు.మరోవైపు భారత్ మాత్రం 2003 కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ కట్టుబడి ఉండాలని భారత్ పదేపదే విజ్ఞప్తి చేస్తోంది.First published: October 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు