Home /News /national /

LARGELY REDUCED COOKING GAS PRICES IN METRO CITIES BN

వంట వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధర

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ మహానగరంలో 14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.207 తగ్గి.. రూ.589.50 నుంచి ప్రారంభం కానుంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర సైతం రూ.336 తగ్గి.. రూ.988 నుంచి ప్రారంభం అవుతుంది.

    వంట గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. దీంతో హైదరాబాద్ మహానగరంలో 14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.207 తగ్గి.. రూ.589.50 నుంచి ప్రారంభం కానుంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర సైతం రూ.336 తగ్గి.. రూ.988 నుంచి ప్రారంభం అవుతుంది. నెలవారీ సమీక్షలో ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం వల్లే మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా తగ్గాయి. ఈ ధరలన్నీ మే ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తుండడం గమనార్హం. ఇక ఢిల్లీలో ఎలీపీజీ సిలిండర్ ధర రూ.744 నుంచి రూ.581.50కి పడిపోయింది. ముంబై నగరంలో రూ.714.50 నుంచి రూ.579కి దిగొచ్చింది. కోల్‌కతాలో ఒక్కో సిలిండర్‌పై రూ.190 తగ్గి రూ.584.50 కాగా, చెన్నై నగరంలో రూ.569.50కు ధర పడిపోయింది.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Gas, LPG Cylinder, Oil prices

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు