పాకిస్తాన్ కుట్రను భగ్నంచేసిన BSF.. కశ్మీర్‌లోకి ఆయుధాలు, డ్రగ్స్

అర్నియా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో 58 ప్యాకెట్ల డ్రగ్స్‌తో పాటు రెండు పిస్టళ్లు, నాలుగు మ్యాగైజన్స్, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: September 20, 2020, 12:46 PM IST
పాకిస్తాన్ కుట్రను భగ్నంచేసిన BSF.. కశ్మీర్‌లోకి ఆయుధాలు, డ్రగ్స్
పాకిస్తాన్ కుట్రను భగ్నంచేసిన BSF.. కశ్మీర్‌లోకి ఆయుధాలు, డ్రగ్స్
  • Share this:
సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ రెచ్చిపోతున్నాయి. ఎల్ఏసీ వెంబడి డ్రాగన్ చెలరేగిపోతుంటే.. ఎల్‌వోసీ వెంబడి పాకిస్తాన్ కవ్విస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘనతో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలు, డ్రగ్స్ సరిహద్దు దాటించేందుకు కుట్ర చేసింది. పాకిస్తాన్ పన్నిన కుట్రను బీఎస్ఎఫ్ (బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్) భగ్నం చేసింది. జమ్మూకశ్మీర్‌లో సరిహద్దు గుండా భారీ ఎత్తున మాదకద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా చేయాలన్న దుండగుల కుట్రలను భారత బలగాలు తిప్పికొట్టారు. అర్నియా సెక్టార్‌లో పాకిస్తాన్ వైపు సరిహద్దుకు సమీపంలో కొంతమంది అనుమానిత వ్యక్తులు తిరుగడాన్ని భారత సైనికులు గమనించి హెచ్చరిక కాల్పులు జరిపారు. దుండగులు అప్రమత్తమై అక్కడి నుంచి పారిపోయారు.

వారు తిరిగిన ప్రాంతంలో తనిఖీ చేయగా.. భారీ ఎత్తున ఆయుధాలు, రెండు తుపాకులు, మాదకద్రవ్యాలు లభ్యమయ్యాయి. అర్నియా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో 58 ప్యాకెట్ల డ్రగ్స్‌తో పాటు రెండు పిస్టళ్లు, నాలుగు మ్యాగైజన్స్, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఒక పైపు ద్వారా వాటిని భారత్‌లోకి తరలించేందుకు యత్నించినట్లు వెల్లడించారు. దుండగులకు భారత్‌ వైపు కూడా సంబంధాలు ఉండే అవకాశం ఉందని బీఎస్ఎఫ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 20, 2020, 12:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading