LANGURS FOR PRESIDENT SECURITY UP ADMINISTRATION WEIRD HACK TO DEAL WITH MONKEY MENACE AMID PREZ KOVIND VISIT PVN
Langurs for President security : రాష్ట్రపతి భద్రతలో కొండెంగలు..అందుకేనట
కొండెంగలు
Langurs for President security:ఉత్తరప్రదేశ్(UttarPradesh)లోని బృందావన్ లో కోతుల బెడద ఎక్కువగానే ఉంటుంది. శ్రీకృష్ణుడు నడియాడిన ఈ పవిత్ర పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు ప్రతిరోజూ ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
Langurs for President security:ఉత్తరప్రదేశ్(UttarPradesh)లోని బృందావన్ లో కోతుల బెడద ఎక్కువగానే ఉంటుంది. శ్రీకృష్ణుడు నడియాడిన ఈ పవిత్ర పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు ప్రతిరోజూ ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా అక్కడికి వచ్చే భక్తులపై అప్పుడప్పుడు కోతులు దాడులు చేస్తుంటాయి. భక్తుల మెడలోని గొలుసులు,చేతుల్లోని వస్తువులు,లేదా ఆహారపదార్థాలు,జేబుల్లోని పర్శులు,కళ్లకు ఉండే స్పెట్స్ లాక్కొని వెళ్లడం వంటి పనులు చేస్తుంటాయి. అయితే సోమవారం ఉత్తరప్రదేశ్ లోని మథురలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటించారు. ఈ సందర్భంగా మథుర పక్కనే ఉన్న బృందావన్ కు కూడా రామ్ నాథ్ కోవింద్(Ram Nath kovind)వెళ్లారు.
బృందావన్‌లోని మహిళా ఆశ్రయ్ సదన్‌తోపాటు బాంకే బిహారీ ఆలయాన్ని రాష్ట్రపతి సందర్శించారు. కాగా, ఈ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో అక్కడి అధికారులు రాష్ట్రపతి భద్రత కోసం కొండెంగలను(Langurs)మోహరించారు. శిక్షణ పొందిన కొండెంగలను తీసుకొచ్చి అక్కడ కాపలా ఉంచారు. వీటిని ట్రైనర్ రామ్‌నివాస్ తీసుకొచ్చారు. వీటి నియంత్రణ బాధ్యతను అటవీ శాఖకు చెందిన ప్రొఫెషనల్ ట్రైనర్లకు అప్పగించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ పర్యటన ముగిసేంతవరకూ ఇవి సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహించాయి. రాష్ట్రపతి పర్యటనకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో కొండెంగలను ఆశ్రయించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
ఈ కొండెంగలు.. కోతుల కంటే దాదాపు రెట్టింపు పరిమాణంలో ఉంటాయి, ఇవి కోతుల కంటే మరింత చురుకైనవి, బలంగా ఉంటాయి. కొండెంటలు ఉండటంతో, రోడ్డుపై నుండి ప్రజల వస్తువులను లాక్కొనే కోతులు పైకప్పులు లేదా చెట్లపై దూరంగా ఉండిపోయాయి. రాష్ట్రపతి పర్యటన ముగిసి కొండెంగలను అక్కడి నుంచి తరలించిన తర్వాత ఆ కోతులు మళ్లీ అక్కడి వీధుల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.