Video: విరిగిపడిన కొండచరియలు.. ఒక్కక్షణంలో ఒళ్లు గగుర్పొడిచే సీన్!

విరిగిపడిన కొండచరియలు

Landslide in Himachal: హిమాచల్ ప్రదేశ్ అంటేనే కొండలు, పర్వతాలు. ఇక వానాకాలం వస్తే... అక్కడ ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం. తాజాగా అలాంటి ఘటనే జరిగింది.

 • Share this:
  Shimla Landslide: వానాకాలం రాగానే... ఉత్తరాది రాష్ట్రాలకు పర్యాటకులు (tourists) పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. ఈ సమయంలో అక్కడ జలపాతాలతోపాటూ... పర్యాటక ప్రదేశాలు పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. దానికి తోడు ఎన్నో ప్రాచీన ఆలయాలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నాయి. అందువల్ల ఈ సీజన్‌లో విదేశీ టూరిస్టుల (foreign tourists) రాక కూడా ఎక్కువగా ఉంటుంది. ఐతే... ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ సమయంలో కంటిన్యూగా మంచు, వర్షం కురుస్తూ (monsoon rains) ఉంటాయి. ఫలితంగా చాలా చోట్ల రోడ్లు దెబ్బతింటాయి. ఒక్కోసారి కొండరాళ్లు విరిగి రోడ్డుపై పడుతుంటాయి. ఆ సమయంలో అక్కడ వాహనదారులు ఉంటే... ప్రాణాలకే ప్రమాదం.

  వాతావరణమే సమస్య:
  తాజాగా సిమ్లా (shimla)లో అలాంటి ఓ ఘటన వాహనదారులకు వణుకు పుట్టించింది. నేషనల్ హైవేపై వాహనాలు వెళ్తుండగా... జ్యోతి ఏరియాలో ఒక్కసారిగా కొండరాళ్లు విరిగి (mountain collapse) రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై చాలా వాహనాలున్నాయి. వారంతా అప్రమత్తంపై ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కొందరేమో... వాహనాల్లోంచి దిగి రోడ్డుపై పరుగులు పెట్టారు. మరికొందరు ఆ బండరాళ్లు పడిపోతుంటే వీడియోలు తీశారు. అదృష్టం కొద్దీ వాహనాలకు కూడా ఏమీ కాలేదు. కాకపోతే బండరాళ్లు రోడ్డుపై పడటంతో... ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనిపై జిల్లా యంత్రాంగం అలర్ట్ అయ్యింది. రాంపూర్ SDM, పోలీస్ టీమ్ రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

  అక్కడ తీసిన వీడియో ఇక్కడ చూడండి.

  చూశారా ఎంత సడెన్‌గా జారి పడ్డాయో. అందుకే ఘాట్ రోడ్డుల్లో ప్రయాణించేటప్పుడు... ఎదురుగా, వెనక వచ్చే వాహనాలను మాత్రమే కాదు... చుట్టూ ఉన్న కొండల్ని, చెట్లను కూడా గమనిస్తూ ఉండాలి. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉంటే... తప్పించుకొని ప్రాణాలు కాపాడుకోవచ్చు.

  గతంలోనూ ఎన్నో ప్రమాదాలు:
  హిమాచల్ ప్రదేశ్‌లో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఆ మధ్య జులై 25న సంగ్లాలోని చిత్కూల్ రూట్ కిన్నార్ దగ్గర ఇలాగే కొండరాళ్లు విరిగిపడ్డాయి. ఆ సమయంలో ఓ పర్యాటకుల వాహనంపై రాళ్లు పడటంతో (accident) అది ఘోరంగా దెబ్బతింది. అందులోని 9 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది.

  గత నెలలో కిన్నార్ జిల్లాలోని నిగులసరీ ప్రాంతంలో బండరాళ్లు విరిగి.. రెండు కార్లు, ఆ టాటా సుమో, ఓ ట్రక్‌పై పడ్డాయి. అవి పూర్తిగా మట్టిలో మూసుకుపోయాయి. వాటిలో 28 మంది చనిపోయారు. వాతావరణం సరిగా లేకపోవడంతో... NDRF, హిమాచల్ ప్రదేశ్ పోలీసులకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం కూడా కష్టమైపోయింది.

  ఇది కూడా చదవండి: Video: బొంగురు పిల్లి... బాక్సులో దూరింది... వీడియోకి కోటికి పైగా వ్యూస్!

  వర్షాకాలంలో హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్లకపోవడమే మేలు. ఎందుకంటే... ఈ సీజన్‌లో అక్కడ రెగ్యులర్‌గా బండరాళ్లు జారిపడుతూనే ఉంటాయి.
  Published by:Krishna Kumar N
  First published: