Chandrayaan 2: సెప్టెంబర్‌ చంద్రయాన్ 2లో మరో కీలక ఘట్టం

ఇప్పటివరకు చంద్రయాన్ 2లో ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. సేఫ్ ల్యాండిగ్‌పై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు ఛైర్మన్ శివన్.

news18-telugu
Updated: August 20, 2019, 3:19 PM IST
Chandrayaan 2: సెప్టెంబర్‌ చంద్రయాన్ 2లో మరో కీలక ఘట్టం
చంద్రయాన్ 2
  • Share this:
చంద్రయాన్ 2లో ఇవాళ అత్యంత కీలక ఘట్టం పూర్తయ్యింది. అయితే సెప్టెంబర్ 2న చంద్రయాన్ 2లో మరో కీలక ఘట్టం ఉందన్నారు ఇస్రో ఛైర్మన్ శివన్. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన ఆయన... సెప్టెంబర్ 2న లూనార్ ఆర్బిట్ నుంచి ల్యాండర్ వేరు అవుతుందని తెలిపారు. అలా వేరైన ల్యాండర్ సెప్టెంబర్ 7న చంద్రుడిపైకి చేరుతుందన్నారు. ఇప్పటివరకు చంద్రయాన్ 2లో ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. సేఫ్ ల్యాండిగ్‌పై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ముందుగానే అన్ని పరీక్షలు నిర్వహించామన్నారు శివన్. చంద్రయాన్ 1లో ఉత్పన్నమైన సమస్యలు చంద్రయాన్ 2లో రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

చంద్రయాన్-2లో మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-2 ఉపగ్రహం చేరింది. సరిగ్గా ఇవాళ ఉదయం 9:02 నిమిషాలకు ఉపగ్రహం చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. జూలై 22న చంద్రయాన్-2ను అంతరిక్షంలోని పంపించారు ఇస్రో శాస్త్రవేత్తలు. చంద్రయాన్‌–2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడం అత్యంత సవాల్‌తో కూడుకున్న విషయమని ఇస్రో సైంటిస్టులు ఇప్పటికే ప్రకటించారు



First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>