హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bihar: అసెంబ్లీలో బల పరీక్షకు ముందు బిగ్ షాక్.. ఆర్జేడీ నేతల నివాసాలపై ఈడీ దాడులు

Bihar: అసెంబ్లీలో బల పరీక్షకు ముందు బిగ్ షాక్.. ఆర్జేడీ నేతల నివాసాలపై ఈడీ దాడులు

లాలూ ప్రసాద్ యాదవ్

లాలూ ప్రసాద్ యాదవ్

Bihar: కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఈ దాడులు చేయిస్తోందని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ ఆరోపించారు. సీబీఐ దాడులతో బెదిరిస్తే.. ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా మారుతారేమోనన్న భ్రమలోనే బీజేపీ ఇలాంటి పనులు చేయిస్తోందని మండిపడ్డారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  అసెంబ్లీలో బల పరీక్షకు ముందు బీహార్‌ (Bihar)లో అధికార పార్టీ ఆర్జేడీ (Rashtriya Janata Dal)కి బిగ్ షాక్ తగిలింది. ఆర్జేడీ నేతల ఇళ్లపై బుధవారం ఉదయం సీబీఐ దాడులు చేసింది.  పాట్నాలో ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ (RJD MLC Sunil Singh) నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత కాసేపటికే ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు అష్ఫఖ్  కరీం (RJD MP Ashfaque Karim) నివాసానికి కూడా వెళ్లి.. తనిఖీలు చేపట్టారు. ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం (Land for Job Scam)లో సోదాలు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.  కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఈ దాడులు చేయిస్తోందని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ ఆరోపించారు. ఇవి అర్ధం లేని సోదాలని ఆయన విమర్శించారు. సీబీఐ దాడులతో బెదిరిస్తే.. ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా మారుతారేమోనన్న భ్రమలోనే బీజేపీ ఇలాంటి పనులు చేయిస్తోందని మండిపడ్డారు.

  కాగా, బీహార్‌లో జేడీయూ పార్టీ ఇటీవలే బీజేపీతో తెగదెంపులు చేసుకొని.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్.. ఆ తర్వాత ఆర్జేడీతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 10న బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ (Nitish Kumar) ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్‌ (Tejashwi Yadav)కు డిప్యూటీ సీఎం బాధ్యతలను అప్పగించారు. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్‌కు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు. నితీష్ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది. ఇదే సమయంలో ఆర్జేడీ నేతల ఇళ్లల్లో సీబీఐ సోదాలు చేయడంపై బీహార్‌లో రాజకీయ దుమారం రేగుతోంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bihar, JDU, Lalu Prasad Yadav, RJD