Lambda: వామ్మో.. కరోనా కొత్త వేరియంట్ లాంబ్డ.. డేంజరంట

కరోనా కొత్త వేరియంట్ లాంబ్డ (ప్రతీకాత్మక చిత్రం - image credit - twitter - NIAID)

Lambda: కరోనానే తలనొప్పి అనుకుంటే... కొత్త కొత్త వేరియంట్లు వస్తూ... మన ప్రాణాలు తీస్తున్నాయి. ఈ లాంబ్డ తక్కువదేమీ కాదు... ఇప్పటికే 29 దేశాల్లోకి వచ్చేసింది. మనం జాగ్రత్తగా ఉండాల్సిందే.

  • Share this:
    Lambda: ఏ వైరస్ అయినా... ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తిలోకి వెళ్లినప్పుడు... దానిలో ఎంతో కొంత మార్పు రావడం సహజం... అందువల్లే కరోనా వైరస్‌లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఇలా మారేవాటిలో కొన్ని వేరియంట్లు ప్రమాదకరం అవుతున్నాయి. ఇప్పటికే డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని ఎంతలా కలవర పెడుతోందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు లాంబ్డ (Lambda) అనే మరో వేరియంట్ సమస్యగా మారిందని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. దాన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రస్ట్ ('Variant of Interest' (VOI)) అంటే... అది ఇతర దేశాల్లోకి వ్యాపించగలదని అర్థం. ఇది ప్రమాదకరమైన వేరియంటే అంటున్నారు... ఐతే... అత్యంత ప్రమాదకరమా కాదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు అంటున్నారు.

    నిజానికి ఈ లాంబ్డ ఇప్పటిది కాదు. 2020లో దక్షిణ అమెరికాలోని పెరూలో తొలిసారి గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ 29 దేశాల్లో ఇది వ్యాపించింది. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలైన అర్జెంటినా, చిలీ లాంటి దేశాల్లో ఇది ఉంది. జూన్ 14 దీన్ని VOIగా WHO తన వీక్లీ బులిటెన్‌లో ప్రకటించింది.


    పెరూలో ఈ సంవత్సరం ఏప్రిల్‌ నాటికి గుర్తించిన కరోనా కేసుల్లో 81 శాతం కేసుల్లో ఈ లాంబ్డ వేరియంట్ ఉంది. అటు చిలీలో 60 రోజులుగా కరోనా వైరస్ లలో వస్తున్న మార్పుల్లో 32 శాతం... లాంబ్డ వేరియంట్ లాగా ఉన్నాయి.

    లాంబ్డపై దృష్టి:
    లాంబ్డ కారణంగా... కరోనా ఇప్పట్లో తగ్గకుండా మరింత కాలం ఉంటుందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు WHO చెప్పింది. అర్జెంటినాలో ఫిబ్రవరి మూడో వారం నుంచి కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఇందుకు కారణం లాంబ్డానే అని తెలిపింది. అక్కడి కరోనా కేసుల్లో 37 శాతం ఈ వేరియంట్ ఉన్నట్లు తెలిపింది.



    లాంబ్డాలోనూ మార్పులు:
    ఈ లాంబ్డా వేరియంట్‌లో కూడా చాలా మార్పులు వస్తున్నాయన్న WHO... వ్యాప్తి బాగా పెరిగిందనీ, కొన్నిచోట్ల న్యూట్రలైజింగ్ యాంటీబాడీలను కూడా తట్టుకోగలుగుతోందని తెలిపింది. ఈ వేరియంట్‌కి కూడా చుట్టూ ఉండే కొవ్వుతో కూడిన ముళ్లలాంటి స్పైక్ ప్రోటీన్‌లో మార్పులు వస్తున్నాయని వివరించింది. వాటిని సైంటిఫిక్‌గా G75V, T76I, del247/253, L452Q, F490S, D614G, T859N ఇలా చెప్పింది. ఈ సైంటిఫిక్ మార్పులు సైంటిస్టులకు అర్థం అవుతాయి.

    ఇది కూడా చదవండి: Male Pregnancy: ఇక మగాళ్లకూ గర్భం... ప్రయోగాలు సక్సెస్... ఫాదర్స్ బీ రెడీ

    ఇప్పటికైతే మరీ ఎక్కువ టెన్షన్ పడాల్సిన పనిలేదన్న WHO ఈ కొత్త వేరియంట్‌పై లోతైన అధ్యయనాలు జరపాలని కోరింది. అలాగే... వ్యాక్సిన్లు దీనిపై ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో కూడా తేల్చాలని చెప్పింది.
    Published by:Krishna Kumar N
    First published: