Home /News /national /

LALU PRASAD YADAV HEALTH UPDATES LALU TO BE AIRLIFTED TO DELHI TODAY BIHAR CM NITISH KUMAR MEETS HIM IN PATNA HOSPITAL MKS

Lalu Prasad Yadav : విషమించిన లాలూ ఆరోగ్యం.. ఆస్పత్రికి సీఎం నితీశ్.. సింగపూర్ తరలింపు?

లాలూకు నితీశ్ పరామర్శ

లాలూకు నితీశ్ పరామర్శ

బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింతగా విషమించింది. హెలికాప్టర్ లో ఆయనను ఢిల్లీకి ఎయిర్ లిఫ్ట్ చేయనున్నారు. అవసరమైతే సింగపూర్ తీసుకెళతామనీ తేజస్వీ చెప్పారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ లాలూను పరామర్శించారు..

ఇంకా చదవండి ...
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)ఆరోగ్య ప‌రిస్థితి మరింత విష‌మించింది. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఇటీవల ఇంట్లో జారిపడి పడటంతో ఆస్పత్రిలో చేరారు. బుధవారం నాటికి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆయనను హెలికాప్టర్ ద్వారా ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే సింగపూర్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తామని లాలూ తనయుడు, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీయాద్ చెప్పారు. సీఎం నితీశ్ కుమార్ ఇవాళ లాలూను పరామర్శించారు.

లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ను పాట్నా నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు ఈ సాయంత్రం త‌ర‌లించే అవ‌కాశం ఉంది. గ‌త వారం లాలూ త‌న ఇంట్లోనే మెట్లు ఎక్కుతుండ‌గా జారి ప‌డ్డారు. దీంతో ఆయ‌న‌ను హుటాహుటిన చికిత్స నిమిత్తం పాట్నాలోని పారాస్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. లాలూ భుజం, వెన్నెముక‌కు తీవ్ర గాయ‌మైన‌ట్లు డాక్ట‌ర్లు నిర్ధారించారు.


CM KCR : సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. ధరణి, భూసమస్యలపై 15 నుంచి రెవెన్యూ సదస్సులు..


ఢిల్లీ తరలింపునకు ముందే, లాలూను బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ ప‌రామ‌ర్శించారు. సుదీర్ఘకాలం రాజకీయ విరోధులుగా ఉండి, మధ్యలో కలిసిపోయి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసి, మళ్లీ కొన్నేళ్లకే విడిపోయినా లాలూ, నితీశ్ లు వ్యక్తిగత సంబంధాలను మాత్రం కొనసాగిస్తున్నారు. లాలూను సీఎం నితీశ్ పరామర్శించిన సమయంలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాద్ కూడా అక్కడే ఉన్నారు.


CM KCR vs Centre : తెలంగాణకు భారీ షాకిచ్చిన కేంద్రం.. బడ్జెట్ అప్పుల్లో రూ.19వేల కోట్లు కోత..


లాలూ యాదవ్ ను కలిసిన ఫొటోలను షేర్ చేస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సీఎం నితీశ్ ట్విటర్ లో పేర్కొన్నారు. ఆర్జేడీ చీఫ్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఆరాతీశారు. లాలూ కుమారుడు తేజ‌స్వి యాద‌వ్‌కు మోదీ ఫోన్ చేశారు. ఆర్జేడీ చీఫ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మోదీ ఆకాంక్షించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Bihar, Lalu Prasad Yadav, Nitish Kumar, RJD

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు