లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం ఆందోళకరంగా ఉందని ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ తెలిపారు.ఆయన కిడ్నీలు కేవలం 25 శాతం మాత్రమే పని చేస్తున్నాయని.. పరిస్థితి ఏ క్షణంలోనే అయినా విషమించే అవకాశం ఉందని అన్నారు. ఈ విషయాన్ని లాలూ చికిత్స పొందుతున్న రాంచీలోని రిమ్స్ అధికారులకు ఉమేశ్ ప్రసాద్ రాతపూర్వకంగా తెలియజేశారు.లాలూ కిడ్నీలు కేవలం 25 శాతం మాత్రమే పని చేస్తోందని తాను గతంలోనే చెప్పాలని ఉమేశ్ ప్రసాద్ అన్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎప్పుడైనా విషమించవచ్చని అన్నారు.
లాలూ గత 20 ఏళ్ల నుంచి డయాబెటిస్ వ్యాధిలో బాధపడుతున్నారని..ఈ కారణంగానే ఆయన శరీరంలోని పలు అవయవాలు దెబ్బతిన్నాయని అన్నారు. ఈ కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. లాలూ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఆయనను మరో ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదని అన్నారు. డయాబెటిస్ కారణంగా అవయవాలు దెబ్బతిన్న వారి పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఎలాంటి మందులు లేవని అన్నారు. లాలూకు చికిత్స కోసం కిడ్నీ వైద్య నిపుణులను సంప్రదిస్తామని అన్నారు. ఆ తరువాత ఆయనకు ఏ రకమైన చికిత్స అందించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇదిలా ఉంటే పశు దాణా కుంభకోణం కేసులో లాలూ బెయిల్ పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు జనవరికి వాయిదా వేసింది. రెండేళ్ల క్రితం ఆగస్టు 30, 2018న లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యం కారణంగా రిమ్స్‌లో చేరారు. గత అక్టోబర్‌లో లాలూకు చైబాసా ట్రెజరీ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ.. దమ్కా ట్రెజరీ కేసులో బెయిల్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. డిసెంబర్ 2017న ఆయనకు పశు దాణా కేసులో ఏడేళ్ల శిక్ష పడింది. 1991 నుంచి 1996 మధ్య కాలంలో లాలూ సీఎంగా ఉన్న సమయంలో దమ్కా ట్రెజరీ నుంచి రూ. 3.5 కోట్లు అక్రమంగా డ్రా చేశారనే ఆరోపణలు రుజువు కావడంతో ఆయనకు శిక్ష పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lalu Prasad Yadav